వివాదంలో మంచు హీరో సినిమా ?
ఎన్నికల నేపథ్యంలో తన కొత్త సినిమా ఓటర్ విడుదలవుతుందని చూసిన మంచు విష్ణుకు నిరాశే ఎదురైంది. కారణాలు అప్పుడు బయటికి చెప్పలేదు కాని మెల్లగా అందులో వివాదం ఉందన్న తరహలో టాక్ బయటికి వచ్చింది. తాజాగా ఆ చిత్ర దర్శకుడు కార్తీక్ రెడ్డి హీరో మీద చేసిన ఆరోపణలతో ఇది కొత్త మలుపు తీసుకుంది. ప్రచారంలో వచ్చిన వార్తలను బట్టి చూస్తే అసెంబ్లీ రౌడీ తరహా స్క్రీన్ ప్లే తో ఓటర్ సబ్జెక్టుని మార్చుకుందామని అందుకు గాను నిర్మాత రాయల్టీ చెల్లించే విధంగా గతంలో ఒప్పందం జరిగిందట. ఇందులో విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉందని కార్తీక్ చేస్తున్న ఫిర్యాదు.
తనతో బలవంతంగా అగ్రీ మెంట్ మీద సైన్ చేయించారని అసలు ఓటర్ కు అసెంబ్లీ రౌడీకి సంబంధం లేదని అతను చెబుతున్న మాట. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కథ ఓకే చేసిన దశలోనే ఇది అసెంబ్లీ రౌడీ తరహలో సాగితే బాగుంటుందనే ఏకాభిప్రాయానికి అందరూ వచ్చారని ఆ మేరకు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది తప్ప ఏది గుట్టుగా జరగలేదు అనే క్లారిటీ ఇస్తున్నారు. తీరా షూటింగ్ పూర్తయ్యాక చెల్లించాల్సిన మొత్తం అడిగితే దర్శకుడు నిర్మాత ఇద్దరు కలిసి తమకేమి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆయన వెర్షన్ వినిపిస్తున్నారు.
ఇప్పుడు ఇది కోర్ట్ మెట్లు ఎక్కిందని వినికిడి. దీనికి సంబంధించి ఎలాంటి అధికార ధృవీకరణ లేదు. కేవలం ఫిలిం నగర్ లో వస్తున్న టాక్ ని బట్టి ఓటర్ రాద్ధాంతం జరిగినట్టు తెలిసింది. ఈ కారణంగానే ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సిన ఓటర్ ని వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు విదేశాల్లో ఉండటం వల్ల ఇంకా నేరుగా స్పందించలేదు