కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా ప్రముఖ సినీ తారలు పలువురు విరాళాలను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాతిక కోట్లు విరాళంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించాడు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్న కొందరు ఇతర హీరోలపై విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ హీరోలం.. స్టార్స్.. సూపర్ స్టార్ అంటూ కీర్తించబడుతున్న పలువురు హీరోలు ఇప్పటి వరకు కరోనా విపత్తు నేపథ్యంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు రాలేదు.
ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పై ట్రోల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. హీరోగా.. వ్యాపారవేత్తగా.. నిర్మాతగా ఎన్నో రకాలుగా వందల వేల కోట్ల సంపాదన దక్కించుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు కరోనా విపత్తుకు తన సాయం అందించడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా భారీగా లాభాలను ఆయన దక్కించుకున్నాడు. అయినా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో తన దాతృత్వంను చాటుకునేందుకు ఆయన మనసు అంగీకరించడం లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇలా అంతా కూడా బాద్ షా షారుఖ్ ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలిస్తున్నారు. దాతృత్వంను చాటుకుంటే చాలు దాన్ని పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోనక్కర్లేదు అంటున్నారు. మీడియాలో రానంతమాత్రాన షారుఖ్ ఖాన్ విరాళం ఇవ్వనట్లు కాదనే విషయాన్ని గుర్తించాలంటూ ఫ్యాన్స్ కొందరు అంటున్నారు.
ప్రస్తుత సమయంలో స్టార్స్ ఎంత హెల్ప్ చేశారు అనే విషయాన్ని జనాలు చూస్తూ ఉంటారు. పబ్లిసిటీ కోసం కాకున్నా మేమున్నాం అనే భరోసా కలిగించేలా స్టార్స్ విరాళాలు ప్రకటించాలంటూ కొందరు భావిస్తున్నారు. ఈ ట్రోల్స్ అన్నింటికి షారుఖ్ ఎలా సమాధానం చెప్తాడో చూడాలి.