'నో పెళ్లి'ని 'సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా మార్చేద్దామని ట్రై చేస్తున్న చిత్ర యూనిట్...!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ చిత్రంలో తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడదులై ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమన్ స్వరపరచిన ఈ సాంగ్ కి బ్యాచిలర్ జీవితమే గొప్పదంటూ.. పెళ్లి చేసుకోవద్దంటూ రఘురామ్ లిరిక్స్ అందించాడు. అర్మన్ మాలిక్ ఈ పాటను అద్భుతంగా ఆలపించగా యశ్వంత్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసారు. ఈ పాటలో తేజ్ తో పాటు టాలీవుడ్ హీరోలు రానా వరుణ్ తేజ్ లు కూడా కనిపించి అలరించారు. ‘నో పెళ్లి’ సాంగ్ యూట్యూబ్ లో 8 మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
ఇదిలా ఉండగా ఈ చిత్ర యూనిట్ 'నో పెళ్లి' సాంగ్ ని ఎలాగైనా 'సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా మార్చేద్దాం అని తెగ ట్రై చేస్తుందట. దీని కోసం ఇప్పటికే కవర్ సాంగ్స్ అని ఎన్నో వీడియోలను రిలీజ్ చేస్తూ వస్తోందట. అంతేకాకుండా యూట్యూబ్ లో అన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అని తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఐతే ఈ పాటని సోలోగా వింటే బాగానే ఉందని అంటున్నప్పటికీ పెళ్లి వద్దంటూ వచ్చిన పాత నో పెళ్లి పాటలకు ఇది ఏ మాత్రం సరి తూగడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'పెళ్లి వద్దు' అనే నేపథ్యంలో గుర్తొచ్చే పాటలు 'మన్మథుడు' సినిమాలోని 'వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా' మరియు 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరు'. అయితే ఇప్పటి నుండి 'నో పెళ్లి' సాంగ్ కూడా ఆ లిస్ట్ లో చేర్చాలని 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్ ట్రై చేస్తూనే ఉన్నారు. మరి వారి కోరిక నెరవేరి జనాలు ఈ సాంగ్ ని వింటే బాగుండు అని మ్యూజిక్ ఫోక్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ మూతబడిపోవడంతో వాయిదా పడింది. షూటింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే మిగతా భాగం చిత్రీకరణ చేసి సినిమాని థియేటర్స్ కి తీసుకురానున్నారు.