స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ని జూన్ 9న మద్రాస్ లోని మహాబలిపురంలో వున్న రిసార్ట్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులు, కోలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. భారీ ఏర్పాట్ల మధ్య అత్యంత వైభవంగా నయన్ - విఘ్నేష్ ల వివాహం జరిగింది. గత ఐదేళ్లుగా పెళ్లి గురించి దాటవేస్తూ వస్తున్న ఈ జంట మొత్తానికి పెళ్లి వార్త చెప్పింది.
అయితే పెళ్లైన రెండవ రోజే తిరుమల వీధుల్లో దర్శన మిచ్చిన నయన దంపతులు తాజాగా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. పెళ్లికి ముందు తమిళనాడు గుళ్లూ గోపురాలు తిరుగుతూ ప్రత్యేక పూజలు జరిపించి వార్తల్లో నిలిచిన ఈ జంట తాజాగా మరోసారి పెళ్లి తరువాత తిరుమల వీధుల్లో చెప్పులతో తిరుగుతూ, తిరుమాడ వీధుల్లో ఫొటో షూట్ లతో వార్తల్లో కెక్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వివాదంగా మారింది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో తిరుమాడ వీధుల్లో చెప్పులతో భార్యా భర్తలు నయనతార - విఘ్నేష్ శివన్ తిరుగుతూ ఫొటో షూట్ లో పాల్గొన్నారట. దీనిపై నెటిజన్ లు ఫైర్ అవుతున్నారు. నెట్టింట ఈ కొత్త జంటపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. నయనతార, విఘ్రేష్ శివన్ చెప్పులు వేసుకుని తిరుబమాడవీధుల్లో ఫొటో షూట్ చేయడం, చెప్పులు వేసుకుని తిరగడం వంటి వీడియోలు, ఫొటోలపై టీటీడీ పాలక మండలి తాజాగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
మాడవీధుల్లో నయనతార దంపతులు చెప్పులతో నడవడం దురదృష్ణకరమని పేర్కొంది. ఈ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఎలాంటి సెక్షన్ ల కింద కేసులు నమోదు చేయవచ్చో పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. పెళ్లైన మరునాడే నయనతార దంపతులు ఇలా వివాదంలో ఇరుక్కోవడం విచారకరమని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో టీటీడీ ఎలాంటి కేసులు పెడుతుందో వేచి చూడాల్సిందే.