ఫోటో స్టొరీ: అంకుల్ తో రకుల్ రొమాన్స్!

Update: 2019-04-22 06:08 GMT
రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఈమధ్య టాలీవుడ్ లో కాస్త తగ్గిందన్న మాట నిజమే కాని తమిళంలో.. హిందీలో సినిమాలు చేస్తూ ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించడంలో తెగ బిజీగా ఉంది. బాలీవుడ్ లో ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న 'దే దే ప్యార్ దే' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఈ సినిమా మే 17 న రిలీజ్ కానుంది.  దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

రీసెంట్ గా ఈ చిత్రం నుంచి 'వడ్డీ షరాబన్'  అంటూ సాగే ఒక సాంగ్ వీడియోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో మద్యం మత్తులో ఉన్న రకుల్ అజయ్ దేవగణ్ ను ఓరగా చూడడం.. స్టెప్పులు వేయడం ప్రేక్షకులను మెప్పించాయి.  ఈ సినిమా నుండి తుమిలా తో హైనా అంటూ సాగే మరో పాటను ఈరోజు రిలీజ్ చేసారు.  దీనికి సంబందించిన పోస్టర్ లో అజయ్ దేవగణ్.. రకుల్ ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. ఒక సూపర్ మార్కెట్ లో అజయ్ ట్రాలీని నెడుతూ ఉండగా రకుల్  అదే ట్రాలీపై ఎక్కి అజయ్ మొహానికి తన మొహాన్ని దగ్గరగా పెట్టి మధ్యలో మిల్లీ మీటర్ కూడా గ్యాప్ లేకుండా ప్రేమ డేటా ట్రాన్స్ ఫర్ చేస్తోంది. పింక్ టాప్.. మైక్రో జీన్స్ నిక్కర్లో అల్ట్రా స్టైలిష్ గా ఉంది. అజయ్ కూడా లైట్ గ్రీన్ కలర్లో ఉన్న ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్.. గ్రే కలర్ ప్యాంట్ తో అందంగా ఉన్నాడు. ఫోటో సడెన్ గా చూస్తే అజయ్ కు యాభై ఏళ్ళ వయసుందని ఎవరూ నమ్మలేరు.

అయినా కొందరు అల్లరి నెటిజనులు ఉంటారు కదా? వాళ్ళు మాత్రం 'అంకుల్ తో రొమాన్స్ చేస్తున్నావా రకుల్? అంటూ కామెంట్స్ పెట్టారు? ఏంటో ఈ జనాలు... ఇక్కడ కూడా హీరోయిన్లను టార్గెట్ చేయడమే. ఏం అజయ్ దేవగణ్ ను ఇలాంటి ప్రశ్నే అడగొచ్చు కదా "అజయ్..  సగం వయసుండే హీరోయిన్ తో ఎందుకు రొమాన్సు చేస్తున్నావు?" అని నిలదీయొచ్చు కదా?  ఈ నెటిజనుల సంగతేమో కానీ రేపు రిలీజ్ కానున్న తుమిలా తో హైనా పాట కు సింగర్ అరిజిత్ సింగ్.  వీలైతే రేపు పాట రిలీజ్ కాగానే వినండి.. 'ఆషికి 2' లో తుమ్ హి హో లాంటి ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ను పాడిన సింగర్ అరిజిత్. మరి రేపు రిలీజ్ కానున్న సాంగ్ తో కూడా మ్యాజిక్ చేస్తాడేమో!


Full View

Tags:    

Similar News