రూమర్స్ కి చెక్ పెట్టిన 'టక్ జగదీష్'..!

Update: 2021-05-27 08:30 GMT
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న తాజా చిత్రం ''టక్‌ జగదీష్‌''. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల విడుదల వాయిదా వేశారు. అయితే ఉన్నట్టుండి 'టక్ జగదీష్' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారని రూమర్స్ వచ్చాయి.

'టక్ జగదీష్' చిత్ర నిర్మాతలు ప్రముఖ ఓటీటీతో డీల్ ని ఫైనలైజ్ చేయడంలో బిజీగా ఉన్నారని.. త్వరలోనే డిజిటల్ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ దీనిపై స్పందిస్తూ అవన్నీ అవాస్తవాలని.. నాని సినిమా థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ''టక్ జగదీష్ సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఇది థియేటర్ ఎక్సపీరియన్స్ కోసం రూపొందిస్తున్న సినిమా. దయచేసి ఓటీటీ రిలీజ్ అంటూ వచ్చే పుకార్లను నమ్మవద్దు. టక్ జగదీష్ చిత్రాన్ని కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసి ఆస్వాదించండి" అని చిత్ర యూనిట్ ప్రకటించారు. దీంతో ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది.

కాగా, 'టక్ జగదీష్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. గ్రామీణ నేపథ్యంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్ర పోషించగా.. నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Tags:    

Similar News