నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''టక్ జగదీష్''. ఇందులో రీతూ వర్మ - ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 23న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ కు స్పందన లభించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'పరిచయ వేడుక' పేరుతో రాజమహేంద్రవరంలో చేసిన ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ ఈవెంట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ఏప్రిల్ 13న 'టక్ జగదీష్' థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీని కోసం వైజాగ్ లో గ్రాండ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కళ్ళకు కాటుక-చేతులకు పారాణి-నుదుటన బొట్టు పెట్టుకొని పెళ్లి కొడుకులా ముస్తాబైన నాని.. పట్టు పంచె పైకి కట్టి ఓ రథం ముందు నిలబడి ఉన్నాడు. ఇందులో జగదీష్ నాయుడిగా నాని కనిపిస్తుండగా అన్న పాత్రలో జగపతిబాబు.. తండ్రిగా నాజర్ నటిస్తున్నారు. డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.