టీవీ నటుడిగా పాపులర్ అయిన కరణ్ ఒబేరాయ్ కు బెయిల్ వచ్చింది. ఒక యువతిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన అతగాడు.. కొద్ది రోజులుగా జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నించిన అతగాడి ప్రయత్నాలకు బాంబే హైకోర్టు ఎట్టకేలకు ఆయనకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. అత్యాచారానికి సంబంధించిన దృశ్యాల్ని వీడియో తీసి.. తనకు డబ్బులు ఇవ్వాలని.. లేని పక్షంలో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో.. అతడిపై బాధిత యువతి కంప్లైంట్ చేసింది.
ఈ నేపథ్యంలో ఫిర్యాదు మీద విచారించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కు తరలించారు. 14 రోజులుగా రిమాండ్ లో ఉన్న ఆయనపై ఐపీసీ సెక్షన్ 376.. 384 కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలు ఫలించి.. తాజాగా ముంబయి హైకోర్టు రూ.50వేల పూచికత్తు మీద బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.