బాలీవుడ్ ప్రేక్షకులు గత కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. మొన్నటికి మొన్న సమ్మర్ లో కూడా విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా అమీర్ ఖాన్ ప్రకటించిన విషయం తెల్సిందే.
అమీర్ ఖాన్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున మరో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అక్షయ్ కుమార్ నటించిన రక్ష బంధన్ కూడా విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ల పరిస్థితి అస్సలు బాగా లేదు. ఇలాంటి సమయంలో క్ల్యాష్ అవసరమా అంటూ చాలా మంది చర్చిస్తున్నారు.
లాల్ సింగ్ చద్దా మరియు రక్ష బంధన్ రెండు సినిమా లు కూడా భారీగా అంచనాలు ఉన్న సినిమాలు మరియు స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలు. కనుక బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో రెండు సినిమాలకు కూడా నష్టం తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వర్గాల వారు మాత్రం ఈ సినిమా ల్లో ఏదో ఒకటి వెనక్కి తగ్గితే బాగుంటుందని అంటున్నారు.
తాజాగా అక్షయ్ కుమార్ ఈ విషయమై స్పందించాడు. లాంగ్ వీకెండ్ ఉన్న సమయంలో రెండు భారీ చిత్రాలు ఒక్క రోజున రావడం వల్ల నష్టం ఏమీ జరగదు అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. తప్పకుండా రెండు సినిమాలకు కూడా మంచి వసూళ్లు నమోదు అవుతాయి అనే నమ్మకంను అక్షయ్ కుమార్ వ్యక్తం చేస్తున్నాడు.
గతంలో అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ మరియు అక్షయ్ నటించిన వెల్ కమ్ సినిమా లు రెండు కూడా ఒకే రోజున విడుదల అయ్యి రెండు కూడా మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచాయి. రెండు సినిమా లు కూడా మంచి టాక్ ను దక్కించుకుంటే తప్పకుండా రెండు సినిమా లకు కూడా మంచి వసూళ్లు నమోదు అవుతాయి అనేది అక్షయ్ కుమార్ అభిప్రాయం.
కాని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు మాత్రం ఖచ్చితంగా రెండు సినిమాలు కలిసి వస్తే రెండు సినిమాలకు కూడా నష్టం. ఏ ఒక్క సినిమా అయినా నెగటివ్ టాక్ ను దక్కించుకుంటే ఆ సినిమా వసూళ్లు జీరో అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ విశ్లేషకులు అంటున్నారు. అమీర్ ఖాన్ ఈ పోటీ గురించి ఎలా స్పందిస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.