బాల‌య్య‌...వీర‌య్య ప్రీరిలీజ్ వేదిక‌లు ఇవేనా?

Update: 2022-12-15 10:30 GMT
బాల‌య్య‌...చిరంజీవి బాక్సాఫీస్ వార్ కి ఇప్ప‌టికే డేట్లు లాక్ అయిన సంగతి తెలిసిందే. జ‌న‌వ‌రి 12న ' వీర‌సింహారెడ్డి' రంగంలోకి దిగితే...ఆ మ‌రుస‌టి రోజు వీర‌య్య  సీన్లోకి వ‌స్తున్నాడు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద త‌గ్గాఫ్ వార్ త‌ప్ప‌ద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఎవ‌రిది ఎంత ద‌మ్ము ఆ రోజు తేల్తుంది. 'గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి'..'ఖైదీ నెంబ‌ర్ 150' రిలీజ్ త‌ర్వాత ఇలా పోటీ ప‌డ‌టం ఇదే తొలిసారి.

ఇద్ద‌రు గెలుపుపై ఎవ‌రి ధీమాతో వారున్నారు. మ‌రోవైపు సోష‌ల్  మీడియాలోనూ రెండు సినిమాలు ప్ర‌చార ప‌ర్వంలో పోటీ ప‌డుతున్నాయి. రెండు  సినిమాలు నువ్వా?  నేనా? అన్న‌రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయి. పోటాపోటీగా లిరిక‌ల్ సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు. రెండు చిత్రాల్ని నిర్మించింది ఒకే సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అయినా తెలివైనా గేమ్ ఆడుతూ జ‌నాల్లోకి సినిమాల్ని తీసుకెళ్తున్నారు.

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు సైతం పోటీగా ప్లాన్ చేస్తున్నారా?  వీర‌య్య‌ని వైజాగ్ లో..రెడ్డిగార్ని సీమ‌లో ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. జ‌న‌వ‌రి 8న వాల్తేరు వీర‌య్య ఈవెంట్ ని విశాఖ న‌గ‌రంలో భారీ ఎత్తున నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు  లీకులందుతున్నాయి. వైజాగ్ బ్యాక్ డ్రాప్లో సాగే స్టోరీ నేప‌థ్యంలో ఈవెంట్ అక్క‌డ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

ఇది మెగాస్టార్ ఆలోచ‌న అని స‌మాచారం. వైజాగ్ లో ఈవెంట్ చేస్తే గ‌నుక హైద‌రాబాద్ నుంచి తెలంగాణ‌ జ‌నాల్ని తీసుకురావ‌డం కోసం స్పెష‌ల్ గా ట్రైన్ కూడా  వేసే ఆలోచ‌న‌లో ఉన్నారుట‌. ఇక్క‌డి క‌ల్చ‌ర్ పూర్తిగా వారికి కొత్త ఫీల్ ని అందిస్తుంది అన్న కోణంలో వాళ్ల‌ని ఇక్క‌డికి ర‌ప్పించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

అలాగే 'వీర‌సింహారెడ్డి' ఫ్యాక్ష‌న్ స్టోరీ కావ‌డంతో సీమగ‌డ్డే స‌రైన వేదిక‌ని బాల‌య్య స‌హా అంతా భావిస్తున్నారుట‌. ఆయ‌న గ‌త సినిమా 'అఖండ‌' ఈవెంట్ క‌ర్నూల్ లో జ‌రిగింది.  ఈ నేప‌థ్యంలో వీరసింహారెడ్డి ఈవెంట్ని జ‌న‌వ‌రి 6న‌ అనంత‌పురంలో నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారుట‌. రెండు ఈవెంట్లు ఒకేసారి చేయ‌డం ఇబ్బంది కాబ‌ట్టి నాలుగు రోజులైనా గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారుట‌. మ‌రి వీటిపై నిర్మాత‌లు స్పందిస్తే త‌ప్ప క్లారిటీ రాదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News