KGF నిర్మాతల నుంచి మరో పాన్ ఇండియా

Update: 2022-06-10 13:42 GMT
KGF సినిమాతో దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా గుర్తింపు అందుకున్న హోంబల్ ఫిలిమ్స్ నుంచి రానున్న రోజుల్లో అంతకుమించి అనేలా సినిమాలు వస్తాయని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో ఈ సంస్థ సలార్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సంస్థ సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

మలయాళం ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తో కూడా ఒక కొత్త ప్రాజెక్టు ను స్టార్ట్ చేయబోతున్నట్లు హోంబల్ ఫిలిమ్స్  అఫీషియల్గా క్లారిటీ ఇచ్చింది. కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను నిర్మించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తో చేయబోయే సినిమా కూడా తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

 టైజన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక సీరియస్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పృథ్విరాజ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఐఏఎస్ ఆఫీసర్స్ కు సంబంధించిన పేర్లను ఒక బోర్డ్ మీద రాస్తున్నట్టుకు పోస్టర్ లో కనిపిస్తోంది. ఇక టైసన్ అంటే ఎవరు అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే అంశాలపై ఈ సినిమా తెరపైకి రాబోతున్నట్లు అర్థమవుతోంది.

ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే విభిన్నమైన సినిమాలను అందించడంలో ముందుంటాడు అని చెప్పవచ్చు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అతనికి తమిళం తెలుగులో కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక్కడ జనాలకు కూడా పృద్వి రాజ్ గురించి బాగా తెలుసు కాబట్టి అతని సినిమాలు భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయితే మంచి విజయాలను అందుకుంటాయి. ఇక టైసన్ అనే ఈ సినిమాకు పృథ్వీరాజ్ తన స్వీయ దర్శకత్వంలో తెర పైకి తీసుకు వస్తూ ఉండడం విశేషం. మరి ఈ ప్రాజెక్ట్ పాన్  ఇండియా మార్కెట్లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News