సామ్ 2కోట్లు.. చైత‌న్య 12కోట్లు

Update: 2018-09-15 04:41 GMT
బాక్సాఫీస్ వ‌ద్ద భార్య‌భ‌ర్త‌ల హ‌వా సాగుతోంది. స‌మంత అక్కినేని న‌టించిన `యుట‌ర్న్‌` ఊహాతీతం అనిపించే రీతిలో తొలిరోజు 2కోట్ల వ‌సూళ్లు సాధిస్తే - నాగ‌చైత‌న్య అక్కినేని న‌టించిన `శైల‌జారెడ్డి అల్లుడు` ఏకంగా 12కోట్ల వ‌సూళ్ల‌తో కెరీర్ బెస్ట్‌ని ఇచ్చింది. యుట‌ర్న్‌ - శైల‌జారెడ్డి అల్లుడు ఒకే రోజు రిలీజై డే1 చ‌క్క‌ని ఓపెనింగులతో ఆక‌ట్టుకున్నాయని ట్రేడ్ చెబుతోంది.

`యుట‌ర్న్` తొలిరోజు సుమారు 2కోట్ల గ్రాస్ వ‌సూలు చేస్తే - అందులో కోటి 10ల‌క్ష‌ల షేర్ వ‌సూలైంది. `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రం తొలిరోజు 12కోట్ల గ్రాస్ (6.50 కోట్ల షేర్ ) వ‌సూలు చేసి చై కెరీర్ బెస్ట్ గా నిలిచింద‌ని రిపోర్ట్ అందింది. ఈ రెండు సినిమాల‌కు మిక్స్‌ డ్ రివ్యూలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు తొలిరోజు క్రేజీగానే థియేట‌ర్ల వైపు వెళ్లార‌ని ఈ లెక్క‌లు చెబుతున్నాయి.

ఈ వీకెండ్‌ లో శ‌ని - ఆదివారాల వ‌సూళ్లు మ‌రింత పెరుగుతాయ‌న‌డంలో సందేహం లేదు. అంటే తొలి నాలుగు రోజుల్లో ఈ రెండు సినిమాలు చ‌క్క‌ని వ‌సూళ్ల తో ట్రేడ్‌ లో ఉత్సాహం నింపే ఛాన్సుంది. 7కోట్ల బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిన‌ యుట‌ర్న్ సేఫ్ జోన్‌ లోకి వ‌చ్చేయ‌డం ఈజీనే. అలానే సోమ‌వారం త‌ర్వాతా వ‌సూళ్లు స్థిరంగా సాగిస్తే శైల‌జారెడ్డి అల్లుడు చిత్రం సేఫ్ జోన్‌ లోకి వ‌చ్చేస్తుంది. చైత‌న్య కెరీర్ బెస్ట్ వ‌సూళ్లను ఈ చిత్రం అందిస్తుంద‌ని అక్కినేని అభిమానుల్లో అంచ‌నాలేర్ప‌డ్డాయి కాబ‌ట్టి కాస్తంత వీకెండ్ 3రోజుల ఓపెనింగ్‌ రిపోర్ట్ కోసం వేచి చూడాల్సిందే.
   

Tags:    

Similar News