తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మెరుపులు మెరిపించి.. సిల్వర్ స్క్రీన్ పై అందాలు కురిపించిన బ్యూటీ అంటే.. ఇప్పుడు అనసూయ.. రేష్మిల పేర్లు గుర్తుకొస్తాయ్. కానీ అంతకంటే ముందే ఈ ప్రయత్నం చేసేసి సక్సెస్ కూడా అయింది యాంకర్ కం హోస్ట్ అయిన ఉదయభాను. కొన్నింటిలో హీరోయిన్ గాను.. జులాయి టైటిల్ సాంగ్ మెప్పించిన ఈమె.. కొన్నేళ్లుగా కెరీర్ ను పక్కన పెట్టింది.
గర్భం దాల్చడం.. ఇద్దరు పండంటి కవలలకు జన్మనివ్వడం.. వారి ఆలనా పాలనాలో మూడేళ్లకు పైగా సమయం గడిచిపోగా.. ఇప్పుడు మళ్లీ తన స్టైల్ లో.. తన స్థాయిలో రీఎంట్రీ ఇచ్చింది. నక్షత్రం మూవీ ఆడియో ఫంక్షన్ కు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించగా.. స్టేజ్ పై ఈమె చూపించిన ట్యాలెంట్ కు అందరూ ముగ్ధులైపోయారు. ఆమె లాంటి సీనియర్ యాంకర్ స్టేజ్ పై ఉంటే.. ప్రోగ్రామ్ కు ఎంతటి ప్లస్ పాయింట్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది ఉదయభాను. ముఖ్యంగా నిర్మాత శ్రీనివాసులు స్పీచ్ ఎక్కువసేపు సాగుతుండడంతో.. ఆడిటోరియం నుంచి అరుపులు వినిపించడం మొదలైంది. దీంతో ఆయన మాటలను సున్నితంగా కట్ చేసి.. ఆయన ఫీలింగ్ ను తనే ఒక్క మాటలో చెప్పేసి పంపేసింది ఉదయభాను.
పంపేయడం కాదు కానీ.. అలా పంపేందుకు ఆమె మాట్లాడిన తీరు.. నా జాబ్ కి మీరు పోటీ వస్తున్నారా అని అడిగి నవ్వులు పంచిన విధానం మాత్రం సూపర్. ఈ మధ్య కాలంలో ఇలాగే ఓ ఫంక్షన్ లో ఓ దర్శకుడు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చిన జనాలను బెదరగొట్టేయగా.. అలాంటి పరిస్థితి రాకుండా ఉదయభాను ప్రదర్శించిన చాకచక్యాన్ని ప్రశంసించాల్సిందే.