తెల్లారితే ఉడ్తా పంజాబ్ థియేటర్లలో సందడి చేయనుంది. వివాదం కారణంగా విపరీతమైన పబ్లిసిటీ దక్కించుకుంది. దీనికి తోడు రిలీజ్ కి రెండు రోజుల ముందే ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్ వచ్చేయడంతో.. సింపథీ కూడా బాగానే వర్కవుట్ అయ్యేట్లుగా ఉంది. తొలి రోజు వసూళ్లు భారీ రేంజ్ లోనే వచ్చే ఛాన్స్ ఉంది. వీకెండ్ వరకూ ఈ జోరు కనిపించినా.. ఓ మోస్తరు బడ్జెట్ కూడా లేని ఈ సినిమా బైట పడిపోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు.
ఇప్పటికే ఆన్ లైన్ లో ఫుల్ మూవీ ఉండడంతో.. సోషల్ సైట్లో ఉడ్తా పంజాబ్ హంగామా బాగానే ఉంది. ముఖ్యంగా.. బిగినింగ్-ఎండింగ్ అయితే అదిరిపోయాయనే కామెంట్స్ బాగా వినిపిస్తోంది. ఇవి మినహాయిస్తే.. సినిమాలో కంటెంట్ ఏముంది? అసలు దీని కోసం సెన్సారోళ్లు ఎందుకింత హంగామా చేశారు? అనే క్వశ్చన్స్ రెయిజ్ అవుతున్నాయి. బహుశా ప్రతీ కేరక్టర్ తోటి బూతులు పలికించడమే సెన్సార్ వాళ్లకు అసలు సమస్య అయుండచ్చని.. ఆన్సర్స్ కూడా వాళ్లే ఇచ్చేసుకుంటున్నారు.
ఇప్పటికే ప్రెస్ ప్రివ్యూ వేయడంతో.. వారి నుంచి కూడా ఇదే టైపు కామెంట్స్ పడుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో నడిచే డ్రగ్ మాఫియాకి.. ఒక ఓపీయం డబ్బాతో చెక్ పెట్టేయచ్చనడం మరీ టూమచ్ అట. ఇక యాక్టింగ్ విషయంలో అయితే.. ఒక్క ఆలియాకి తప్ప ఇంకెవరికీ మార్కులు పడ్డం లేదు. మొత్తం మీద ఉడ్తా పంజాబ్ ని వివాదమే బతికించే ఛాన్సులున్నాయట.