ఇంటర్నేషనల్‌ రివ్యూ చితక్కొట్టింది

Update: 2015-07-13 18:41 GMT
తెలుగు మీడియా, తమిళ మీడియా, బాలీవుడ్‌ మీడియా.. ఇన్ని మీడియాలు బాహుబలి చిత్రంపై రకరకాల రివ్యూల్ని రాసుకొచ్చాయి. వీటిలో లీస్ట్‌ రేటింగ్‌ ఒక్క తెలుగు మీడియాలో మాత్రమే కనిపించింది. నార్త్‌ మీడియా అయితే బాహుబలి చిత్రానికి అద్భుతమైన రేటింగ్స్‌ ఇచ్చింది. అన్నిచోట్లా రివ్యూవర్లు బాగానే రేటింగు ఇచ్చి ఎంకరేజ్‌ చేశారు. అదే ఇంటర్నేషనల్‌ మీడియాలో ఎలాంటి ప్రశంసలు వచ్చాయనే విషయం తెలుసుకోవాలంటే బాహుబలి రివ్యూని ప్రఖ్యాత బ్రిటీష్‌ మీడియా, 'ది గార్డియన్‌' వారి ఆంగ్ల పత్రికలో చదవాల్సిందే.

విదేశీ ప్రేక్షకుల కోసం గార్డియన్‌ రాసిన రివ్యూ అదుర్స్‌. భారతదేశంలోనే ఇంతవరకూ రాని అరుదైన చిత్రమిదని ప్రశంసించింది. బాహుబలి ఫెంటాస్టిక్‌ అంటూ రాసుకొచ్చింది. డబ్బు అనేది మ్యాటరే కాదు. అసలు ఇలాంటి విజువల్స్‌ని క్రియేట్‌ చేసేందుకు దమ్ము కావాలి కదా అని ప్రశంసించింది సదరు రివ్యూ. బడ్జెట్‌ సంగతి అలా ఉంచితే అమెరికన్‌ స్టూడియోలన్నీ ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఇంప్రెస్సివ్‌ రిజల్ట్‌ అంటూ మెచ్చుకుంది.

ఒక ఇన్‌ఫాంట్‌ని చేతిపై ఎత్తుకుని నదిలోకి ఆ యువతి వెళ్లే తీరు ఆకట్టుకుంది. వెయ్యి బాణాలకు ఎదురెళ్లే హీరోయిజం సాధ్యమే అని నిరూపించాడు ఆ హీరో అంటూ ప్రభాస్‌ని ఆకాశానికెత్తేసింది. పతాక సన్నివేశాలు 45 నిమిషాలు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. హాలీవుడ్‌ ప్రమాణాలతో యుద్ధసన్నివేశాల్ని తెరకెక్కించారని  గార్డియన్‌ ప్రశంసించడం మన తెలుగు క్రిటిక్స్‌ తెలుసుకోవాలేమో.
Tags:    

Similar News