కొత్తపిల్లకు కూడా ఒకేసారి రెండు

Update: 2015-04-07 05:53 GMT
హిందీ సీరియళ్లతో పాపులర్‌ అయిన నటి ఉల్కా గుప్తా. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించి చక్కని పేరు తెచ్చుకుంది. ఝాన్సీకి రాణీ, దేవోంకీ దేవ్‌ మహదేవ్‌ టెలీసీరియళ్లు ఈ అమ్మడికి గుర్తింపు తెచ్చాయి. తాజాగా ఆకాశ్‌ పూరి సరసన 'ఆంధ్రాపోరి' చిత్రంలో నాయికగా నటిస్తోంది. అలాగే గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన రుద్రమదేవి 3డి చిత్రంలో టీనేజీ రుద్రమగా నటిస్తోంది. వాస్తవానికి ఝాన్సీకి రాణిలో నటించిన అనుభవం రుద్రమదేవిగా నటించడానికి అక్కరకొచ్చింది.

అలాగే ఈ అమ్మడు నటిస్తున్న ఆంధ్రాపోరి మేలో రిలీజ్‌కి వస్తోంది. ఈ చిత్రానికి 'రుషి' ఫేం రాజ్‌ మాదిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఉల్కా ఆంధ్రా పోరిగా నటిస్తోంది. ఆంధ్రాపోరికి లైనేసే నైజాం కుర్రాడిగా ఆకాశ్‌ నటిస్తున్నాడు. పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. ఇదో మరాఠీ సినిమాకి రీమేక్‌. ఉల్కా గుప్తా మరాఠా టీవీకి కూడా సుపరిచితం కాబట్టి ఈ సినిమాలో నటించడం కూడా ఈజీ అయిపోయింది. ఆయా పాత్రల్లో స్వీయానుభవం ఉంది కాబట్టే ఉల్కాని ఈ అవకాశాలు వరించాయి. అయితే ఇలా ఒకేసారి రెండు సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ ఒకే సీజన్‌లో రిలీజ్‌ అంటే.. అమ్మడు బన్నీ, నిత్యా మీనన్‌ తదితరుల క్యాటగిరీలో చేరిందని ఆనందపడుతోంది. వాళ్ళకు కూడా ఇప్పుడు రెండేసి రిలీజ్‌లు ఉన్నాయి మరి.
Tags:    

Similar News