ముంబైలోని ఓ షిప్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. చాలా మంది నటుల స్నేహితులు, సహనటులు, శ్రేయోభిలాషులు తమ సంఘీభావం తెలియజేయడానికి ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. ఆర్యన్ పై నమోదైన ఈ కేసును ఎన్‌సిబి వేగవంతంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి,. కేసు అనూహ్య మలుపులు తిరుగుతోందని తాజా నివేదిక బయటపెట్టింది.
ప్రతి క్షణం కొత్త మలుపులు తిరుగుతూ కేసు తీవ్రతరం అవుతోందని ఎన్‌సీబీ అధికారులు పేర్కొంటున్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా కూడా ఈ కేసు అగాథ క్రిస్టీ -షెర్లాక్ హోమ్స్ నవలల మాదిరిగా మారిందని కోర్టుకు చెప్పడం విశేషం.
ఆర్యన్ ఖాన్‌తో సహా నలుగురు నిందితులను రిమాండ్ కోసం కోర్టు ఎన్సీబీకి అప్పగించింది. విచారణ తరువాత, ఆర్యన్‌ను ఇతరులతో పాటు అక్టోబర్ 11 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అక్టోబర్ 7 వరకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీలో ఆర్యన్ విచారణను ఎదుర్కొంటాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు గోడల మధ్య సైన్స్ పుస్తకాలు చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ కోరిక మేరకు ఎస్పీబీ అధికారులు అతడికి సైన్స్ పుస్తకాలు అందించినట్టు సమాచారం.
ఆర్యన్ ఖాన్ సహా ఇతర నిందితులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్సీబీ నుంచి ప్రతిరోజు భోజనం పెడుతున్నారు. ఇంటి నుంచి వండిన ఆహారాన్ని కార్యాలయ ఆవరణలోకి అనుమతించకపోవడంతో ఎన్సీబీ మెస్ నుంచే ఆర్యన్ కు భోజనం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ , ఇతర నిందితుల ఫోన్ లు ఫోరెన్సిక్ కోసం గాంధీ నగర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన అధికారులు ఆ డేటాను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.రేపటితో ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన నార్కోటిక్స్ అధికారులు కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అనేక సాక్ష్యాలు లభించినట్టు తెలుస్తోంది. అందులో లభించిన మొదటి సాక్ష్యం స్వయంగా ఆర్యన్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెండో సాక్ష్యం వాట్సాప్ చాటింగ్.. అతడు వాట్సాప్ చాటింగ్ లో డ్రగ్స్ కు సంబంధించిన కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించాడని.. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారని చెబుతున్నారు. ఆర్యన్ ఖాన్ తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారని.. అప్పుడప్పుడూ డ్రగ్స్ పెడ్లర్ ద్వారా కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. డార్క్ వెబ్ వాడినట్టుగా కూడా తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ కేసులో నిందితులైన ఇతరుల వాట్సాప్ చాట్‌ల నుండి 'దిగ్భ్రాంతికరమైన, నేరపూరితమైన' సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ ప్రకటించింది. కానీ ఆర్యన్ సహ నిందితుడు అర్బాజ్ మర్చంట్ తండ్రి వారిపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తమ బిడ్డలను అన్యాయంగా ఇరికించారని ఆయన ఆరోపిస్తున్నారు.
ముంబై టు గోవా వెళ్తున్న షిప్ లో ఎన్సీబీ అధికారులు జరిపిన దాడిలో కొందమంది యువకులు, యువతులు డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా దొరికిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడుల తరువాత పోలీసులు తమకు డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడులు చేస్తున్నారు.