‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తెలుగు వారినే ఉత్తరాది వారిని కూడా ఊపేస్తోంది.
సాధారణ ప్రజలనే కాదు.. ఇప్పుడు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే గతంలో ప్రధాని మోడీ ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని’ రాజమౌళి చిత్రాన్ని ప్రచారంలో వాడుకున్నాడు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ‘పుష్ప’ మూవీని ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో వాడేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'లోని పాటలు, సిగ్నేచర్ స్టెప్స్ మాత్రమే కాదు, భాషతో సంబంధం లేకుండా డైలాగ్స్ వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలు బన్నీ మ్యానరిజం మరియు డైలాగ్‌లను పలకడం.. వాటిని స్వయంగా చేయడం మనం చూశాము.. ఇప్పుడు మనం ‘ఫైర్’ డైలాగ్‌ని కేంద్ర మంత్రి నోటి వెంట వినడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ నెల 14న ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలో రాజ్‌నాథ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని ప్రశంసించారు.
“ఈ మధ్య కాలంలో ‘పుష్ప’ అనే సినిమా గురించి చాలా బజ్ ఉంది. పుష్ప అంటే పువ్వు మరియు పుష్కర్ కూడా. సీఎం పుష్కరాలపై విపక్ష కాంగ్రెస్ హేళన చేస్తోంది. అతని పేరు పువ్వు అని కూడా అర్ధం కావచ్చు, కానీ అతను కూడా ఫైర్ అని.. అతను ఏమి చేసినా (ఝుకేగా నహీ..) దేనికి తగ్గేదే లే ” అని దేనికి తలొగ్గడు అంటూ పుష్ప డైలాగులను రాజ్‌నాథ్ పలికి సభికులను ఆశ్చర్యపరిచాడు.
‘పుష్ప’కి ఉన్న క్రేజ్ కొత్త హద్దులను చేరుకుంది.. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పుష్ప సినిమాను ప్రచారంలో వాడుకోవడం వైరల్ గా మారింది.
Full View