ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నవీన్ పొలిశెట్టికి జాతిరత్నాలు సినిమాతో మంచి బ్రేక్ దక్కింది. కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి ఏడాది గడుస్తున్నా ఇంకా సినిమా మొదలు పెట్టడేం అనుకుంటూ ఉన్న సమయంలో నేడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఒకే సారి రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చేశాయి. ఆ రెండు సినిమాలు కూడా చిన్నా చితక బ్యానర్ ల్లో కాదు. ఒకటేమో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ ను నిర్మించిన యూవీ క్రియేషన్స్ లో కాగా.. రెండవది పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నవీన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో మొదట ఏది వస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు కాని రెండు సినిమాలు కూడా నవీన్ పొలిశెట్టిని మరో విజయ్ దేవరకొండ రేంజ్ కు తీసుకు వెళ్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
రాధే శ్యామ్ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ నిర్మాతలు అయిన వంశీ మరియు ప్రమోద్ లు మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క మరియు నవీన్ పొలిశెట్టిలు ముఖ్య పాత్రల్లో సినిమాను నిర్మించబోతున్నట్లుగా చాలా నెలలుగా పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లు నిజం అన్నట్లుగా నేడు అధికారిక ప్రకటన వచ్చింది. ముఖ్యంగా ఈ వార్త అనుష్క అభిమానులకు ఆనందం కలిగించేది. ఇక ఈమద్య కాలంలో పెద్ద చిన్న అనే తేడా లేకుండా భారీ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో సినిమాను నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలు రెండు కూడా 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జాతి రత్నాలు సినిమాలో నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ కు అంతా కూడా ఫిదా అయ్యారు. ఆయన అద్బుతమైన కామెడీ తో ఆయన ఒక నాచురల్ ఫిజిక్ మరియు ఆకట్టుకునే నటనతో మంచి భవిష్యత్తు ఉన్న నటుడు అనే టాక్ ను దక్కించుకున్నాడు. తప్పకుండా నవీన్ పొలిశెట్టికి ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందించడం ఖాయం.. దాంతో ఆయన టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల సరసన చేరిపోవడం కూడా ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం చేసినా కూడా రెండు మంచి బ్యానర్ లను ఎంపిక చేసుకుని సినిమాలను నటిస్తున్నందుకు నవీన్ పొలిశెట్టిని అంతా అభినందిస్తున్నారు. మా తరపున కూడా నవీన్ కు అభినందనలు మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు. వచ్చే ఏడాది పుట్టిన రోజు వరకు ఆయన కెరీర్ లో మరో రెండు భారీ విజయాలు నమోదు అవ్వాలని కోరుకుందాం.