మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య, ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అయిన ఉపాసన కామినేని అంటే తెలియని వారు ఉండరు. అపోలో హాస్పిటల్స్ లో కీలకమైన స్థానంలో ఉన్న ఈమె గురించి పరిచయం అవసరం లేదు. ఆమె తన దాతృత్వ కార్యకలాపాలతో సమాజంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆమె తాత, ప్రముఖ పారిశ్రామికవేత్త.. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి- అతని కుటుంబం భారతదేశంలోని 100 మంది బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించి సంచలనం సృష్టించారు.. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2021 ప్రకారం ప్రతాప్ రెడ్డి కుటుంబం దేశంలోని అతి సంపన్న బిలియనీర్లలో 78వ స్థానంలో ఉంది.
ఉపాసన కుటుంబం మొత్తం సంపద విలువ రూ. 21,000 కోట్లు. సుమారు 15 మంది వ్యక్తులు మొదటిసారి మొదటి 100 స్థానాల్లో నిలిచారు. ఇందులో ప్రతాప్ సి రెడ్డి వారిలో ఒకరు. అతని సంపద 169% వరకు పెరిగిందని నివేదించబడింది.
ప్రతాప్ సి రెడ్డి 1983లో అపోలో హాస్పిటల్ ను స్థాపించారు. ఇది ఇప్పుడు ఆసుపత్రులు, ఫార్మసీలు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, టెలిమెడిసిన్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పరిశోధన కేంద్రాలు.. వైద్య విద్యా కేంద్రాలుగా మారి దేశంలోనే అతిపెద్ద వైద్య ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంది.
అపోలో గ్రూప్ కోర్ బాడీలో ప్రీతా రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్), శోభనా కామినేని (ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్), సునీతారెడ్డి (మేనేజింగ్ డైరెక్టర్).. డాక్టర్ సంగిత రెడ్డి (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్) ఉన్నారు.
జాబితా ప్రకారం హైదరాబాద్ నుంచి 56 మంది.. తెలంగాణ రాష్ట్రం నుండి 63 మంది బిలియనీర్లు ఉన్నారు. దివి లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళీ దివి అత్యంత సంపన్న హైదరాబాదీగా సుమారు రూ. 79,000 కోట్లతో నిలిచారు.. అతను మొదటి ధనవంతులైన భారతీయుల జాబితాలో 14వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో చేరిన మరో హైదరాబాదీ బిలియనీర్ హెటెరో లాబొరేటరీస్ బి. పార్తసారధి రెడ్డి. అతని సంపద దాదాపు రూ. 26,000 కోట్లు కావడం విశేషం.