ఫోటో స్టొరీ: ఉపాసనకు అవార్డు.. చరణ్ దిల్ ఖుష్!

Update: 2019-04-21 06:24 GMT
నెటిజనులు.. అందులోనూ ముఖ్యంగా మెగా అభిమానులు శ్రద్దగా ఫాలోయ్ అయ్యే సెలబ్రిటీలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఒకరు. చరణ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.  చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు కాబట్టి ఆ బాధ్యత ఉపాసన తీసుకుంటుంది.

చరణ్ భార్యామణిగానే కాకుండా 'బీ పాజిటివ్' మ్యాగజైన్ ను నడిపే వ్యక్తిగా.. అపోలో ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ హెల్త్ విషయంలోజాగ్రత్తగా ఉండడం.. పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకునే అంశాలపై ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది ఉపాసన.  మరి ఇలా సొసైటీలో పాజిటివ్ చేంజ్ కోసం పరితంపించే వ్యక్తికి దానికి తగిన గుర్తింపు దక్కకుండా ఎలా ఉంటుంది? తాజాగా ఉపాసనకు ఒక అవార్డును ప్రదానం చేశారు.

ఉపాసనకు రీసెంట్ గా 'ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్-2019' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు.  ఈ అవార్డును అందుకున్న తర్వాత ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఉపాసన ఇలా ట్వీట్ చేశారు.. "ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్ #దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది.  నా చుట్టూ ఉన్న పాజిటివ్ వ్యక్తులకు.. మంచి చేయాలంటూ నన్ను రెగ్యులర్ గా మోటివేట్ చేస్తూ ఉన్నవారికి ఈ అవార్డును అకింతం ఇస్తున్నాను.  నాతో ఎప్పుడూ వెన్నంటి ఉంటూ నాకు మద్దతుగా ఉన్నందుకు నా ప్రియమైన కుటుంబానికి థ్యాంక్ యు."

ఈ అవార్డు కు స్పందనగా రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా "డియరెస్ట్ ఉప్సి.. నిన్ను చూసి చాలా గర్విస్తున్నాను. దాదాసాహెబ్ ఫాల్కే -ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు." అంటూ అభినందించాడు. మరోవైపు అభిమానులు కూడా ఉపాసనకు అభినందనలు తెలుపుతున్నారు. 
Tags:    

Similar News