మెగా హీరో రామ్‌చరణ్ సతీమణి వ్యాపార రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అపోలో హాస్పిటల్స్‌లో భాగస్వామిగా ఉన్న ఆమె వాటి అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల సాంకేతికను జోడించేందుకు మైక్రోసాప్ట్ అధినేత సత్యం నాదెళ్లను కలిసిన విషయం తెలిసిందే. ఈ వార్తతో ఆమె సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ప్రస్తుతం ఆమె పేరు మళ్లీ మీడియాలో మారుమోగుతోంది. ఎందుకంటే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా చర్చించుకుంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు చేవెళ్ల నుంచి టికెట్ ఇవ్వడంతో ఎంపీగా గెలుపొందారు. కొన్ని నెలల కిందట ఆయన కేసీఆర్‌తో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలో ఆయనకు ధీటైన అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెతుకుతున్నారట. అయితే ఆయనపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసనను పోటీకి నిలబెట్టనున్నారని ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది. కేటీఆర్‌కు రామ్‌చరణ్ మంచి స్నేహితుడు. అందువల్ల ఉపాసనను రంగంలోకి దించితే మెగా ఫ్యాన్స్ కూడా కలిసి వస్తారని కేటీఆర్ భావించారని ఆ కథనంలో పేర్కొన్నారు.
కాగా ఉపాసనకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్వయాన బాబాయ్. ఆమె పిన్ని సంగీతారెడ్డికి భర్త. ఉపాసన రాజకీయాల్లోకి వచ్చినట్టు వార్తపై ఉపాసన స్పందించారు. తాను బాబాయ్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్నారు. తాను ఆపోలో హాస్పిటల్‌లో ఓ ఉద్యోగినని, తాను ఉద్యోగాన్ని మాత్రమే ప్రేమిస్తానన్నారు. అంతేకాకుండా సంగీతారెడ్డి తనకు బాస్ అని అందువల్ల బాబాయ్‌పై పోటీ చేయలేనని పేర్కొన్నారు.