ఉపాసన పాఠాలు: కరోనా ఇలా కంట్రోల్

Update: 2020-03-03 07:30 GMT
కరోనా వైరస్.. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని కబళించేందుకు రెడీ అయ్యింది. భారతదేశానికి.. హైదరాబాద్ కు వచ్చేసింది. 60 దేశాల్లో 90వేలకు మందికి పైగా సోకి 3వేల మందికి పైగా మరణాలకి కారణమైంది. వేల మంది చికిత్స పొందుతున్నారు.

తాజాగా దుబాయ్ వెళ్లొచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా సోకింది. అతడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో నమోదైన తొలి కేసు ఇదే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల ఆందోళనల నేపథ్యం లో చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తతపై సూచనలు చేశారు. అపోలో హాస్పిటల్స్ యజమానులైన ఉపాసన వైద్య సేవల్లో పాలుపంచుకుంటారు. ఆ క్రమంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జ్వరం, దగ్గు, జలుబు, చాతిలోనొప్పి కరోనా లక్షణాలని ఉపాసన తెలిపారు.ఈ లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. కరోనాకు మందు లేదని.. హోమియోపతి మందు ఉందని అంటున్నారని.. నిర్ధారణ కాలేదన్నారు. ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కొని మాస్కులు ధరించాలని సూచించారు. మాంసాహారం తినడం వల్ల కరోనా సోకదని.. మాంసాన్ని బాగా ఉడికించి తినాలని సూచించారు. ఇక వ్యాధి లక్షణాలుంటే బయట తిరగనీయవద్దని ఉపాసన చెప్పారు.


Tags:    

Similar News