కాశీకి పోయాను రామా హరీ! .. గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ!
శ్రీశైలమెళ్ళాను రామా హరీ, .. శివుని విభూది తెచ్చాను రామా హరీ!
మొత్తానికి ఇక్కడ కనిపిస్తున్న మెగా కోడలు ఎక్కడికి వెళ్లారని అనుకుంటున్నారు? ప్రయాగలో కుంభమేళా 2019కు ఎటెండ్ అయ్యారని చూస్తుంటే అర్థమవుతోంది. మనిషి జీవితం పాపపుణ్యాల మేళవింపు. అందుకే పాపాల్ని కడిగేసుకుని - పుణ్యాన్ని దోసిట పట్టేందుకు ప్రజలంతా ఆధ్యాత్మికతను అనుసరిస్తున్నారు. 4 మార్చి మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికే పరమ శివుని పూజలకు రెడీ అవుతున్నారు. కాశీ సహా హిమాలయాల్లో శివనామస్మరణం మార్మోగిపోతోంది. దేవతలు కొలువుండే చోట ప్రత్యేక పూజలకు భక్తులు సిద్ధమవుతున్నారు.
ఇక భక్తి పారవశ్యంతో పాటు పుణ్యం పరమార్థం విషయంలో మెగా కోడలు ఉపాసన ఓ మెట్టు పైనే ఉన్నారు. హెల్త్ టూరిజంతో పాటు ఇలా భక్తి టూరిజాన్ని తాను ఇష్టపడుతున్న సంగతి అర్థమవుతోంది. అలా వెళ్లిన చోటల్లా ఎందరో కొత్త కొత్త వారు కలుస్తుంటారు. వాళ్లంతా మిత్రులు అయిపోతుంటారు. అలా ప్రయాగరాజ్ కుంభమేళా 2019 ట్రిప్ నుంచి ఓ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు ఉపాసన. జీవితంలో అనుకోకుండా కలిసేవారు.. అనుకోకుండా ఎదురయ్యే సన్నివేశాల వల్ల జీవితం ఎంతో మారుతుంది! అంటూ ఉపాసన వ్యాఖ్యను జోడించారు. కుంభమేళా అనుభవాన్ని ఎవరూ విడిచిపెట్టొద్దు అని అన్నారు. ఆరు చోట్ల ఉపాసన కుంభమేళాకు సంబంధించిన సంగతుల్ని పరిశీలించారు. ఆ పయనం ఇంకా అలా సాగుతూనే ఉందిట. ఈ ప్రయాణంలో ఎంతో తెలుసుకున్నానని, తనని తాను రీజనవేట్ చేసుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే భారతదేశ సంస్కృతిలో భక్తికి అంత గొప్పతనం, ప్రాధాన్యత ఉందని అర్థం చేసుకోవచ్చు.