మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త మాత్రమే కాకుండా ఒక సోషల్ వర్కర్ అనే విషయం కూడా తెల్సిందే. సామాజిక బాధ్యతతో వ్యవహరించే ఉపాసన సోషల్ మీడియా ద్వారా సామాన్యులను చాలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చుకునే పూల బొకేల విషయంలో ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది. ఆమె రిక్వెస్ట్ ను జనాలు పట్టించుకుంటారో లేదో కాని ఆమె ఇన్సియేషన్ మాత్రం అభినందనీయం.
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది పూల బొకేలు ఇచ్చుకోవడం లేదంటే పూలను ఎక్కువగా వాడుతూ అవి వాడి పోయిన తర్వాత పడేయడం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. కాని ఉపాసన రిక్వెస్ట్ ఏంటీ అంటే వాడిపోయిన పూలను మరియు పూల బొకేలను ఒక స్వచ్చంద సంస్థ వారికి ఇవ్వాలట. వారు వచ్చి సేకరిస్తారని.. వారికి తమ వద్ద వాడిపోయిన పూలు ఉన్నాయని చెప్తే చాలంటూ ఆమె అంటోంది.
హోలి వేస్ట్ అనే ఒక కంపెనీ వారు వాడిపోయిన పూలను రీసైకిల్ చేస్తారట. వాడిపోయిన పూల ద్వారా అగరుబత్తులు మరియు దూప్ స్టిక్స్ ను వారు తయారు చేస్తున్నారట. వాడిపోయిన పూలను వృదాగా పడేయకుండా చెత్తలో కలిపేయకుండా.. మట్టిలో కలిపేయకుండా రీసైక్లింగ్ కు ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుందని ఉపాసన జనాలను రిక్వెస్ట్ చేస్తుంది. పూలను ప్రత్యేకంగా పక్కకు ఉంచి వాటిని సదరు రీ సైక్లింగ్ కంపెనీ వారికి ఇచ్చేందుకు ఎంత మంది ముందుకు వస్తారో చూడాలి. ఉపాసన చేసిన ఈ రిక్వెస్ట్ ను ఎంత మంది పట్టించుకుంటారో చూడాలి.