పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇద్దరు అగ్ర దర్శకులతో పాటు..ఓ మీడియం దర్శకుడితోనూ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ -కె' అనే భారీ చింత్రంతో పాటు...'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తయినా అవసరం మేర అప్పుడప్పుడు ముంబై వెళ్లక తప్పలేదు.
ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యేవి కాదు. వచ్చే ఏడాది ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా క్లారిటీ లేదు. దీంతో డార్లింగ్ ముందుగానే అప్రమత్తమయ్యాడు. తెలివిగా యంగ్ మేకర్ మారుతితో 'డీలక్స్ రాజా' అనే సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్ష పనులు జరుగుతున్నాయి.
అవసరం మేర మారుతి స్ర్కిప్ట్ లో మార్పులు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మే నుంచి ప్రారంభం అవుతుందని అంటున్నారు. దీనిలో భాగంగా 18000 చదరపు అడుగుల లావిష్ ఇంటి సెట్ ని నిర్మిస్తున్నారుట. షూటింగ్ దాదాపు అంతా ఈ సెట్ లోనే చేస్తారని సమాచారం. ఇది ఓ డిఫరెంట్ మారుతి మార్క్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు.
ప్రభాస్ తో మారుతి కామెడీ ఎంటర్ టైనర్ నే తీస్తున్నారని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి. 'బుజ్జిగాడు' తర్వాత ప్రభాస్ సినిమాల్లో కామెడీ ఎక్కడా పండలేదు. అందుకే ఇప్పుడు కామెడీని పండించే మారుతిని డార్లింగ్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం డార్లింగ్ ఎక్కువ కాలం డేట్లు కేటాయించనట్లు తెలుస్తోంది.
నాలుగు నెలల్లోనే సినిమా పూర్తిచేయాలని ఆ పై రిలీజ్ కి సమయం తీసుకున్న పర్వా లేదని డార్లింగ్ ముందుగానే డెడ్ లైన్ పెట్టారుట. కాని సినిమా మాత్రం ఇదే ఏడాది రిలీజ్ అవ్వాలన్నది డార్లింగ్ కండీషన్ పెట్టినట్లు ఇంకొంత మంది అంటున్నారు. మారుతి కూడా సినిమాని వేగంగా పూర్తిచేయగల దర్శకుల్లో ఒకరు. ఎక్కువగా సమయం తీసుకోరు.
అనవసరంగా సమయాన్ని వృద్దా చేయరు. అవసరం అనుకుంటే పూరి స్టైల్లో షూటింగ్ మొత్తాన్ని చుట్టేస్తారు. కాబట్టి మారుతికి ఆ విషయంలో పెద్దగా టెన్షన్స్ ఏమీ ఉండవు. మరి 'డీలక్స్ రాజా' కోసం మారుతి ఏ హీరోయిన్ ని దిగుమతి చేస్తున్నారో చూడాలి.