మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూడు. సినిమాలలో ''గాడ్ ఫాదర్'' ఒకటి. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రానికి అధికారిక రీమేక్. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ''గాడ్ ఫాదర్'' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రోజు చిత్ర బృందం విడుదలపై స్పష్టత ఇచ్చింది. డేట్ ఇవ్వలేదు కానీ.. విజయదశమి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
అయితే కింగ్ అక్కినేని నాగార్జున తన 'ది ఘోస్ట్' చిత్రాన్ని అదే పండక్కి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు ఒకే రోజు రాకపోవచ్చనే వార్తలు వచ్చాయి. పాత్ బ్రేకింగ్ మూవీ 'శివ' సెంటిమెంటుతో అక్టోబర్ 5న ఘోస్ట్ తో రావాలని ఫిక్స్ అయ్యారు నాగార్జున.
చిరు - నాగ్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండటం.. 'గాడ్ ఫాదర్' రిలీజ్ అనౌన్స్ మెంట్ చేసిన తర్వాతే 'ది ఘోస్ట్' విడుదల తేదీ ప్రకటించడంతో.. మెగాస్టార్ తో కింగ్ దీని గురించి చర్చించి డేట్ ఇచ్చి ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి. నాగార్జున 'శివ' సెంటిమెంట్ కోసం చిరంజీవి వెనక్కి తగ్గే అవకాశం ఉందని అనుకున్నారు.
అయితే మనకందిన సమాచారం ప్రకారం 'గాడ్ ఫాదర్' రిలీజ్ విషయంలో మెగాస్టార్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా సందర్భంగా తన సినిమాను విడుదల చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట.
'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత ఈసారి కచ్చితంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితుల్లో.. ఫెస్టివల్ హాలిడేస్ ని వదులుకోడానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
'గాడ్ ఫాదర్' రాక కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది చిరంజీవి కెరీర్ లో 153వ చిత్రం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కండల వీరుడికి తెలుగు డెబ్యూ చిత్రమిది. ఇందులో నయనతార - సత్యదేవ్ - సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
రీమేక్ అయినప్పటికీ మెగాస్టార్ ఇమేజ్ ని మరియు తెలుగు సెన్సిబులిటీస్ ని దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేర్పులతో హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు సరికొత్తగా కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో క్లారిటీ వచ్చేసింది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్‌బి చౌదరి - ఎన్‌వి ప్రసాద్ లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.