అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. ముందుగా అనుకున్న బడ్జెట్ తో పోల్చితే ఏకంగా డబుల్ బడ్జెట్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఖర్చు చేశాడనే వార్తలు వస్తున్నాయి. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
ఏజెంట్ సినిమా మాత్రమే కాకుండా సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీరసింహారెడ్డి' సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఆదిపురుష్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచినప్పటికి ఇటీవలే ఆ సినిమా సంక్రాంతి పోరు నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదిపురుష్ తప్పుకోవడం వల్లే ఏజెంట్ ను సంక్రాంతి బరిలో నిలిపేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అఖిల్ ఒక సాలిడ్ సక్సెస్ కోసం.. బ్లాక్ బస్టర్ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఏజెంట్ తో ఆ విజయం దక్కుతుందా అంటే కచ్చితంగా దక్కుతుందనే నమ్మకంను సదరు చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఎంత స్టఫ్ ఉన్నా కూడా ప్రమోషన్ అదే స్థాయిలో చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంటుంది.
ఏజెంట్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు అనేది కొందరి అభిప్రాయం. సంక్రాంతికి రాబోతున్న ఆ రెండు సినిమాలతో పోటీ పడాలంటే పబ్లిసిటీ పరంగా ఆ రెంటికంటే కూడా ముందు ఉండాలి అనేది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఇప్పటి వరకు ఏజెంట్ సినిమాపై జనాల్లో బజ్ క్రియేట్ చేయడం లో యూనిట్ సభ్యులు సఫలం కాలేక పోయారు.
ఇప్పటికే విడుదల అయిన పబ్లిసిటీ స్టఫ్ తో సినిమా పై పెద్దగా అంచనాలు పెరగలేదు.. ఆసక్తి కూడా కలగలేదు. కనుక విడుదల తేదీ దగ్గర పడుతుంది కనుక ఏజెంట్ గురించి జనాల్లో చర్చ జరిగేలా చేయాలని.. అందుకు తగ్గట్లుగా పబ్లిసిటీ స్టఫ్ ని సోషల్ మీడియాలో వదలాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెంట్ భారీ బడ్జెట్ తో అయితే నిర్మిస్తున్నారు కానీ పబ్లిసిటీ విషయంలో కూడా అదే జోష్ చూపించడం లేదేమో అంటూ కొందరు అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల సమయంకు అయినా ఏజెంట్ యొక్క హడావుడి పీక్స్ కు చేరుతుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.