బోయపాటి.. ఈసారి హద్దులు దాటకుండా..

Update: 2022-10-06 15:30 GMT
పక్క ఊర మాస్ కమర్షియల్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చే అతికొద్దీ మంది దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఒకప్పుడు బి.గోపాల్, వివి వినాయక్ కూడా ఇదే స్టైల్ లో సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఫామ్ కోల్పోయారు. ఈ రోజుల్లో బోయపాటి మాత్రం తన ఫామ్ ను చాలా బలంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇలాంటి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అంటే అతని మ్యాజిక్ ఫ్లేవర్ కొత్తగా ఎప్పటికప్పుడు మాస్ ఫ్యాన్స్ ను ఉరిస్తూనే ఉంది.

ఆ విధంగా బోయపాటి రెగ్యులర్ కమర్షియల్ కథలతోనే సక్సెస్ అందుకుంటూ ఉండటం విశేషం. ముఖ్యంగా అఖండ సినిమాతో అతను సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత చాలామంది అగ్ర హీరోల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ అతను ముందుగా మాట ఇచ్చిన ప్రకారం రామ్ పోతినేని తోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక మొత్తానికి నేడు సినిమా షూటింగ్ అయితే మొదలయ్యింది.

ఇక ఇప్పుడు బోయపాటి ముందు ఉన్న అతి ముఖ్యమైన ఆలోచన ఏమిటి అంటే ముందుగా బడ్జెట్ విషయంలో మాత్రం హద్దులు దాటకుండా ఉండడమే. ప్రతిసారి కూడా బోయపాటి చేసిన సినిమా విషయాలలో బడ్జెట్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతూ వస్తోంది.

ముందుకు అనుకున్న బడ్జెట్ కంటే ఆ తర్వాత లెక్కలు చాలా ఎక్కువగా పెరగడంతో చివరికి అతని పారితోషషికం తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈసారి అలా చేయకుండా బోయపాటి పక్కా ప్రణాళికతోనే రాన్ పోతినేనితో సినిమా చేసేందుకు డిసైడ్ అయ్యాడు. ముందుగానే బౌండెడ్ స్క్రిప్టు సిద్ధం చేసుకున్న బోయపాటి అనుకున్న బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారట. బడ్జెట్ ప్లాన్ ముందుగానే సెట్ చేసుకున్నట్లు సమాచారం. నిర్మాతలు కూడా అతనికి అదే సూచించినట్లుగా తెలుస్తోంది.

అందుకే ఈసారి బోయపాటి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాడట. ఇక రామ్ పోతినేని సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి రామ్ ఆ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడో లేదు కాలమే  సమాధానం చెప్పాలి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News