మునుపెన్నడూ లేని విధంగా తమిళ స్టార్ హీరోలు తెలుగులో సినిమాలు చేయాలని పోటీపడుతున్నారు. బైలింగ్వల్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ తీరా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అవి బైలింగ్వల్ మూవీస్ కాదని, తమిళంలో రూపొందించి తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారని తేలిపోతోంది. ఈ ఏడాది ముగ్గురు తమిళ హీరోలు తెలుగు దర్శకనిర్మాతలతో బైలింగ్వల్ మూవీస్ అంటూ వరుసగా మూడు ప్రాజెక్ట్ అని మొదలు పెట్టారు. స్టార్ హీరో విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో 'వారీసు'లో నటిస్తున్న విషయం తెలిసిందే.
దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగులో 'వారసుడు' పేరుతో 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటే మరో తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగు దర్శకుడు, 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కె.వితో బైలింగ్వల్ మూవీ అంటూ 'ప్రిన్స్' సినిమా చేశాడు. ఇది ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ సమయంలో ఇది బైలింగ్వల్ మూవీ కాదని కేవలం తమిళ సినిమా అని తేలింది.
తెలుగులో అనువాదంగా విడుదల చేశారు. ఇక వీరిద్దరి తరహాలోనే తెలుగు దర్శకుడితో తమిళ హీరో ధనుష్ నటిస్తున్న మూవీ 'సార్'. తమిళంలో 'వాతి' అనే పేరుతో రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో 'సార్' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
గత కొంత కాలంగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ధనుష్ ఇటీవల విడుదలైన 'తిరు' సినిమాతో తొలి సారి వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇక 'సార్' మూవీని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కూడా తెలుగు దర్శక నిర్మాతలు చేస్తున్న తమిళ సినిమానే. గత కొన్ని రోజులుగా ఈ మూవీని డిసెంబర 2న విడుదల చేయబోతున్నామంటూ మేకర్స్ ప్రకటిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. డిసెంబర్ లో జేమ్స్ క్యామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్ 2'తో పాటు పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని హడావిడిగా రిలీజ్ చేయడం కంటే పోస్ట్ పోన్ చేయడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారట.
అంతులో భాగంగానే ఈ మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలను ఆలోచనకు వచ్చినట్టుగా తాజాగా వినిపిస్తోంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ని త్వరలోనే మేకర్స్ ప్రకటించబోతున్నారని, అప్పుడే ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.