టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ సంక్రాంతికి తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' సినిమాతో బరిలోకి దిగారు. తమిళంలో ఆకట్టుకుంటున్న ఈ మూవీ తెలుగులో మాత్రం ఆ స్థాయిలో బజ్ ని క్రేయేట్ చేయలేకపోయింది. దీంతో దిల్ రాజు సంక్రాంతి రేసులో వెనకబడిపోవాల్సి వచ్చింది. ఇదిలా వుంటే టాలీవుడ్ లో ఏ హీరోని కదిలించినా పాన్ ఇండియా మూవీస్, లార్జర్ దెన్ లైఫ్ సినిమాల గురించే ఆలోచిస్తున్నారు. అలాంటి సినిమాలకే తొలి ప్రాధాన్యత నిస్తున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు కూడా ఇప్పుడు ఆ తరహా సినిమాపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 'వారీసు'తో ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దిల్ రాజు ఇకపై లార్జర్ దెన్‌సినిమాకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారట. గత కొంత కాలంగా ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసుకుని కొత్త కథలు సిద్ధం చేయిస్తున్న దిల్ రాజు మొత్తానికి పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం. తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల వివరాలు, డైరెక్టర్స్, హీరోలతో పాటు టైటిల్స్ ని కూడా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబుల కలయికలో ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో యాక్షన్ డ్రామాగా 'వి' మూవీని నిర్మించిన దిల్ రాజు తాజాగా ఇంద్రగంటి తో 'జటాయు' మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారట.
ఇక హిట్ సిరీస్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని, క్రేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తో 'విష్ణుంభర' తీయబోతున్నారట. ఇక 'సలార్' మూవీతో సంచలనాలకు నాంది పలకబోతున్న క్రేజీ జోడీ ప్రశాంత్ నీల్, ప్రభాస్ ల కాంబినేషన్ లో 'రవణం'ని తీయబోతున్నారట. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రభాస్ తో కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దిల్ రాజు చేయాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగులో 'వారసుడు' ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయినా తమిళంలో మాత్రం ఓ రేంజ్ లో రికార్డుల దుమ్ము దులిపేస్తోంది. సాధారణ కథే అయినా విజయ్ స్టార్ డమ్ కారణంగా 'వారీసు'కు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా వుంటే ప్రస్తుతం దిల్ రాజు .. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.