గత కొంత కాలంగా బాలీవుడ్ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. గతంలో వందల కోట్లు రాబట్టిన స్టార్లు కూడా ఈ మధ్య చేతులెత్తేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్ లని ఎదుర్కొంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. కరోనాకు ముందు ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్ కరోనా తరువాత మాత్రం కోలుకోలేకపోతోంది. పూర్వ వైభవాన్ని సంతరించుకోలేకపోతోంది. అమీర్ కాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు.
దీంతో బాలీవుడ్ మళ్లీ కోలుకుని పూర్వపు వైభవాన్ని సొంతం చేసుకోదా?.. బాలీవుడ్ ని కాపాడే నాధుడే లేడా..? అంటూ గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. కార్తీక్ ఆర్యన్, టబు కీలక పాత్రల్లో నటించిన 'భూల్ భులయ్యా 2' రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. అయితే ఆ ఆనందాన్ని అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ కంటినకచూ చేయచలేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశారు.
'బ్రహ్మాస్త్ర' హడావిడి చేసినా అనుకున్న స్థాయిలో బాలీవుడ్ లో మునుపటి వాతావరనాన్ని సృష్టించలేకపోయింది. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్ గన్, శ్రియ, టబు కీలక పాత్రల్లో నటించిన 'దృశ్యం 2' హిట్ టాక్ ని సొంతం చేసుకరుని బాలీవుడ్ వర్గాల్లో కొత్త కాంతుల్ని తీసుకొస్తోంది. దక్షిణాది బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన 'దృశ్యం 2' తొలి రోజు నుంచే బాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయ వంతంగా దూసుకుపోతోంది.
ఫస్ట్ డే రూ. 15.38 కోట్లు వసూలు చేసి తన రికార్డుల ఖాతాని తెరిచింది. మలయాళ రీమేక్ ఆధారంగా ఇప్పటి వరకు అన్ని భాషల్లో రీమేక్ అయిన సినిమాలు సక్సెస్ అవుతూ మంచి వసూళ్లని రాబట్టాయి.
ఆ మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తూ అజయ్ దేవగన్ నటించిన 'దృశ్యం 2' కేవలం ఏడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. హౌస్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకుపోతూ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతున్న ఈ మూవీతో బాలీవుడ్ లో మునుపటి కళ మొదలైంది.
ఇప్పటి వరకు 8 రోజులకు గానూ ఈ మూవీ రూ. 112 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి వసూళ్లని రాబట్టిన సినిమా ఏదీ లేకపోవడంతో బాలీవుడ్ మళ్లీ 'దృశ్యం 2'తో ఊపిరి పీల్చుకుంటోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తాజా వసూళ్లతో 'భూల్ భులయ్యా 2', 'గంగూ బాయి కతియావాడీ' రికార్డులని 'దృశ్యం 2 'తిరగరాసిందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.