సీతారామం ల ఫ‌స్ట్ లెట‌ర్ వ‌చ్చేస్తోంది

Update: 2022-06-24 10:31 GMT
విభిన్న‌మైన చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌. తెలుగులో 'మ‌హాన‌టి' మూవీతో ప‌రిచ‌య‌మైన దుల్క‌ర్ ప్ర‌స్తుతం యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ అంటూ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'సీతారామం'. 'యుధ్దంతో రాసిన ప్రేమ‌క‌థ‌' అని ట్యాగ్ టైన్‌. హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మక వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ పై సి. అశ్వ‌నీద‌త్‌, ప్రియాంక ద‌త్ నిర్మిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తున్నఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నక‌థ‌కు కీల‌క‌మైన క‌శ్మీరీ ముస్లీం యువ‌తిగా అఫ్రీన్ అనే పాత్ర‌లో న‌టిస్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌ద్రాస్ రెజిమెంట్ కు చెందిన లెఫ్టినెంట్ గా రామ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లింప్స్ పేరుతో మూవీ టైటిల్ ని ప్ర‌క‌టిస్తూ చిత్ర బృందం ఓ వీడియోని విడుద‌ల చేసింది. ఈ వీడియోలో న‌మాజ్ చేస్తున్న ముస్లీం యువ‌తిగా ర‌ష్మిక క‌నిపించ‌గా సీతా రామ్ లుగా మృణాల్ ఠాకూర్‌, దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించారు.

వీరి మ‌ధ్య చిత్రీక‌రించిన స‌న్నివేశాలు ల‌వ్ లీగా వున్నాయి. ఇక ఈ స‌తారామ్ ల కోసం స‌హాయం చేసే యువ‌తిగా ర‌ష్మిక పాత్ర‌ని మ‌లిచిన‌ట్టుగా తెలుస్తోంది. రామాయ‌ణాన్ని ఆపాదించి ఈ మూవీలో ర‌ష్మిక పాత్ర‌ని హ‌నుమంతుడికి ప్ర‌తీక‌గా చూపించిన‌ట్టుగా చెబుతున్నారు. రామ్ సీతా రాములు క‌ల‌వ‌డానికి  ఆనాడు హ‌నుమంతుడు స‌హాయం చేస్తే ఈ మూవీలో అదే త‌ర‌హా పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది.

వినూత్న పంథాలో పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగ‌స్టు 5న పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ మూవీకి సంబంధించిన మ‌రో అప్ డేట్ ని చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ గ్లింప్స్ పేరుతో ఓ వీడియోని విడుద‌ల చేసి ఆస‌క్తిని రేకెత్తించిన మేక‌ర్స్ ఫ‌స్ట్ లెటర్ పేరుతో టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌బోతున్నారు.

జూన్ 25న శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు టీజ‌ర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ గ్లింప్స్ లో కీల‌క పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేసిన చిత్ర బృందం టీజ‌ర్ తో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ దివాక‌ర్ మ‌ణి, ఎడిటింగ్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు.
Tags:    

Similar News