అక్కినేని నాగార్జున ప్రవీణ్ సత్తారు కలయికలో వచ్చిన ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ తోనే అక్కినేని అభిమానుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. అంతకు ముందు విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా నాగ్ సినిమాతో విభిన్నంగా కనిపిస్తాడు అని కూడా అందరూ అనుకున్నారు. అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాలో ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా చాలా నీరసంగా ఉంది అని మొదటి రోజే మొదటి ఆటకే నెగిటివ్ టాక్ వచ్చేసింది.
ఇక మొదటి రోజు నైట్ షోలకు వచ్చేసరికి థియేటర్లో చాలావరకు నిండి నిండనట్లుగా కనిపించాయి. ఈ సినిమాకు మొదటి రోజే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు అంతకంటే దారుణంగానే షేర్ కలెక్షన్స్ రావడం షాకింగ్. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ది ఘోస్ట్ సినిమా మొదటి రోజు 2 కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది.
ఇక రెండవ రోజు ఏరియాల వారిగా ఎంత వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే నైజాంలో 24 లక్షలు సీడెడ్ లో 13 లక్షలు ఉత్తరాంధ్రలో 16 లక్షలు ఈస్ట్ లో 5 లక్షలు వెస్ట్ లో 5 లక్షలు గుంటూరులో 6 లక్షలు కృష్ణ లో 5 లక్షలు నెల్లూరులో 3 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా కేవలం 76 లక్షల షేర్ కలెక్షన్స్ తో పాటు 1.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
మొదటి రోజు కంటే రెండో రోజు దాదాపు సగాని కంటే తక్కువగా పడిపోవడం ఈ సినిమా టార్గెట్ కు చాలా కష్టమవుతుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు రాగా ఓవర్సీస్ లో కేవలం 35 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ది ఘోస్ట్ సినిమాకు వచ్చిన షేర్ కలెక్షన్స్ 3.36 కోట్లు. ఇక 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఇలానే కొనసాగితే మాత్రం భారీ స్థాయిలో నష్టాలు కూడా తప్పవు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21.15 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం చూసుకుంటే కేవలం 3.36 కోట్లు మాత్రమే. ఇంకా సక్సెస్ కావాలి అంటే 18.64 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.
నెగిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ కూడా సినిమాకు పెద్దగా కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదని అనిపిస్తోంది. దీంతో సినిమా థియేటర్లు కూడా తగ్గించే ఛాన్స్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.