విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది. ఆగస్టు 25న విడుదల కాబోతున్న లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల గురించి ఒక ప్లాన్ సిద్దం అయ్యిందని తెలుస్తోంది. లైగర్ సినిమా ను కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.
ఉత్తర భారతంతో పాటు సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో కూడా సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న దర్శకుడు పూరి జగన్నాద్ అతి త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నట్లుగా హింట్ ఇచ్చాడు. త్వరలో సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ పాటలను విడుదల చేయబోతున్నారు. అంతే కాకుండా మేకింగ్ వీడియోస్ మరియు ట్రైలర్ రిలీజ్ టీజర్ లను రెడీ చేశారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలకు ఆరు వారాల ముందు నుండే ప్రమోషన్ హడావుడి మొదలు పెట్టబోతున్నారు. అంటే జూలై నెలలో సినిమా యొక్క పబ్లిసటీ హడావుడి మొదలు అవుతుందని యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ముంబయి లో ఉన్న పూరి జగన్నాధ్ అక్కడ నుండే ప్రమోషన్ కార్యక్రమాలను మానిటరింగ్ చేస్తాడట.
లైగర్ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల కోసం ఆగస్టు మొదటి వారం లో మరియు విడుదల సమయంలో హైదరాబాద్ కు పూరి వస్తాడనే సమాచారం అందుతోంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ లో ఉన్నాడు.
ఈ నెల చివరి వరకు తాజా షెడ్యూల్ పూర్తి అవ్వబోతుంది. ఆ తర్వాత నుండి లైగర్ ప్రమోషన్ లో బిజీ అవ్వబోతున్నాడు.
లైగర్ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇస్మార్ట్ శంకర్ తరహా లోనే ఈ సినిమా కూడా యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాద్ తెరకెక్కించాడని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో చెబుతున్నారు. ఆగస్టు లో చాలా సినిమా లు విడుదల కాబోతున్నాయి. కనుక పోటీ కాస్త ఎక్కువ ఉంటుంది.. అందుకే ప్రమోషన్ కాస్త ఎక్కువే చేయనున్నారట.