'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి వరుసగా యువహీరోలతో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే రామ్ తో వారియర్ లో రొమాన్స్ చేసింది. ఇప్పుడు 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో యూత్ స్టార్ నితిన్ తో రొమాన్స్ ని మరో లెవల్లో పండించింది. ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్ పోస్టర్లు ప్రతిదీ నితిన్- కృతి జంట నడుమ రొమాన్స్ ఏ రేంజులో ఎలివేట్ అయ్యిందో వెల్లడిస్తున్నాయి. ట్రైలర్ లో కృతి ఎంతో బ్యూటిఫుల్ గా క్యూట్ గా కనిపించింది.
ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం నుంచి మరో చార్ట్ బస్టర్ లోడింగ్ అంటూ టీమ్ సమాచారం అందించింది. క్యూటీ థండరూ.. అంటూ సాగే ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ 5 ఆగస్టు @ 6PM వెబ్ లో మంటలు పెట్టేందుకు వస్తుందని .. పూర్తి పాటను ఆగస్టు 6న విడుదల చేస్తున్నామని టీమ్ ప్రకటించింది.
తాజాగా విడుదలైన పోస్టర్ లో క్యూటీ లుక్ లో హిప్ చూపిస్తూ కృతి బోల్డ్ ఫోజ్ ఇచ్చింది. ఇక క్యూటీని అల్లుకుపోయే లవర్ బోయ్ లా నితిన్ అంతే వైబ్రేంట్ గా కనిపిస్తున్నాడు. జోడీ కుదిరింది. ఇక తెరపై రొమాన్స్ ఏ లెవల్లో పండిందో వేచి చూడాలి.
రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని రాజకీయ అంశాలతో పక్కా మాస్ .. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణ ప్రమాణాలు అత్యున్నత సాంకేతిక అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్ ఓ ఆసక్తికర పాత్రలో నటించింది.
ప్రసాద్ మూరెళ్ల కెమెరా వర్క్ అందించగా.. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ముగ్గురు మాస్టర్స్ వెంకట్- రవివర్మ - అనల్ అరసు సినిమా యాక్షన్ పార్ట్ కు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా కొరియోగ్రఫీ చేసారు. మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి స్వాతంత్య్ర దినోత్సవం సెలవు (సోమవారం) కలిసి రానుంది.
యూరప్ దేశాల్లోని ఇటలీ- ఆస్ట్రియాలోని కొన్ని సుందరమైన లొకేషన్లలో ఈ సినిమా పాటలను చిత్రీకరించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ అందించారు. ఎం.ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి నిర్మిస్తున్నారు.