వరుస ఫ్లాపులు అనంతరం 'అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. 'ఎన్‌బీకే107' వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
డబ్బై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్టు పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహో గారపాటి నిర్మించబోయే ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు.
బాలయ్య కెరీర్ లో తెరకెక్కబోయే 108వ ప్రాజెక్ట్ ఇది. ప్రీ పొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. తండ్రి, కూతురు మధ్య నడిచే కథ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు.
ఇందులో బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారట. ఆయన కూతురు పాత్రను యంగ్ హీరోయిన్ శ్రీలీల పోషించనుందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్లడించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇప్పటికే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా, తెలుగందం అంజలి తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి లేడీ సూపర్ స్టార్ నయనతారను బాలయ్యకు జోడీగా ఖరారు చేశారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. పైగా బాలయ్య సినిమాకు నయన్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అయినాసరే ఆమెనే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, గతంలో బాలయ్య, నయనతార జంటగా 'సింహ', 'జై సింహా' చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని వార్తలు వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.