'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో రామ్ చరణ్ తో కలిసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమురం భీమ్ గా తారక్ నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఇకపై పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న జూనియర్.. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసాడు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని చేయనున్నారు. గతంలో 'జనతా గ్యారేజ్' వంటి సక్సెస్ ఫుల్ మూవీ చేసిన వీరిద్దరూ.. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో రిపేర్లు చేయనున్నట్లు తెలిపారు. అలానే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తారక్ ఓ భారీ చిత్రాన్ని ప్రకటించారు.
కొరటాల సినిమా కంటే #NTR31 పైనే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పాలి. 'కేజీఎఫ్' తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. చాప్టర్-2 తో అద్భుతమైన విజయం అందుకున్నాడు. వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ చిత్రంగా నిలిపాడు. అందుకే తారక్ - నీల్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు.
మరోవైపు కొరటాల శివ ఇటీవలే 'ఆచార్య' మూవీతో డిజాస్టర్ చవిచూశారు. అంతేకాదు ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలు మిగల్చడంతో.. దర్శకుడు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఈ గందరగోళం మధ్య NTR30 ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెల్లకపోవచ్చనే కామెంట్స్ వస్తున్నాయి.
RRR సినిమాతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోడానికి వీలైనంత త్వరగానే తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాలని తారక్ భావించారు. కానీ అనుకోని కారణాలతో ఇది ఆలస్యమవుతూ వచ్చింది. అయితే కొరటాల సినిమాని త్వరగా పూర్తి చేసి ప్రశాంత్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా..ఇప్పుడు అది కూడా అనుకున్న విధంగా జరగకపోవచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే యాక్షన్ ఫిలిం చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ గా చేసుకొని షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని.. ఇవి పూర్తి చేసిన తర్వాతే మరో ప్రాజెక్ట్ ని డీల్ చేస్తారని పుకార్లు పుట్టుకొచ్చాయి.
'సలార్' రెండు భాగాలుగా చేసినా.. పార్ట్-1ని కంప్లీట్ చేసి, ఆపై ఎన్టీఆర్ చిత్రం పై ఫోకస్ పెడతారని.. ఆపై ప్రభాస్ తో రెండవ భాగానికి వెళ్లాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్ అని టాక్ వచ్చింది. అయితే NTR31 కి వెళ్లేలోపు 'సలార్' రెండు భాగాలను పూర్తి చేయాలని నిర్మాతలు కోరుతున్నారట.
అదే జరిగితే తారక్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి ముందు 'సలార్' రెండు భాగాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ మొదలవ్వడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇలా లైన్ లో పెట్టుకున్న రెండు సినిమాలు కూడా యంగ్ టైగర్ ను చిక్కుల్లో పడేసాయని రూమర్లు వినిపిస్తున్నాయి.
నిజానికి పాన్ ఇండియా స్టార్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి జూనియర్ ఎన్టీఆర్ బాగానే ప్రణాళికలు రచించుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత తనకు ఇంతకముందు సక్సెస్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కొరటాలతో.. అలానే 'కేజీఎఫ్' తో మోస్ట్ డిమాండబుల్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్స్ సెట్ చేసాడు.
కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తారక్ పాన్ ఇండియా ప్లాన్స్ అనుకున్న విధంగా జరుగుతాయో లేదో అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వస్తున్నాయి. మరి త్వరలోనే తదుపరి ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చి ఈ రూమర్స్ కు చెక్ పెడతారేమో చూడాలి.