బాలయ్య - పవన్‌ ల మధ్య వాలిద్దరు.. షూట్ ఎప్పుడంటే!

Update: 2022-12-19 17:30 GMT
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌ లో చంద్రబాబు నాయుడు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కూడా తీసుకు రావడంతో రాజకీయ రంగు ను ఈ షో పులుముకుంటుందా అనే అనుమానాలు జోరుగా వచ్చాయి. ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చ మొదలు అయ్యింది.

పవన్ కళ్యాణ్ ను కూడా అన్‌ స్టాపబుల్‌ కు బాలయ్య తీసుకు రాబోతున్నారు. ఆ విషయమై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. పవన్ తో పాటు ఈ టాక్ షో లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మరియు మరో దర్శకుడు క్రిష్ ను కూడా ఆహ్వానించారనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

బాలయ్య కు క్రిష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా ప్రస్తుతం పవన్ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే పవన్ మరియు బాలయ్య ల మధ్య వారిద్దరు కూడా రాబోతున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. భారీ అంచనాలున్న ఈ ఎపిసోడ్‌ చిత్రీకరణ గురించి క్లారిటీ వచ్చేసింది.

పవన్ కళ్యాణ్ ఈ షో షూటింగ్ కు గాను డిసెంబర్ 27వ తారీకు సమయం ఇచ్చాడట. ఆ సమయం లోనే బాలయ్య కూడా షూటింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ఖాళీగా ఉండబోతున్నాడట. ఆహా ఓటీటీ వారు ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్ వచ్చిన సమయంలో ఆహా వారు కాస్త హడావిడి చేశారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు కనుక అంతకు మించి అన్నట్లుగా ఏర్పాట్లు ఉంటాయనే టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ ఎపిసోడ్‌ ను సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. బాలయ్య అన్ స్టాపబుల్‌ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ సంక్రాంతికి వస్తే పండగ డబుల్‌ అవ్వడం ఖాయం.    




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News