మ‌రోసారి ముస్లీం యువ‌తిగా ర‌ష్మిక‌..ఈసారి క‌లిసొచ్చేనా?

Update: 2022-11-18 23:30 GMT
యువ‌త‌లో ర‌ష్మిక మంద‌న్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆఫాలోయింగ్ కి తోడుగా అమ్మ‌డి స‌క్సెస్ లు బ్యూటీని అగ్ర‌ప‌థాన నిల‌బెట్టాయి.  పుష్ప‌తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయింది. అటుపై వ‌రుస‌గా బ్యాక్ టూ బ్యాక్ బాలీవుడ్ అవ‌కాశాలు ఓడిసి ప‌ట్టుకుంటుంది. ఒక్క హిందీ సినిమా కూడా రిలీజ్ కాకుండా అమ్మ‌డి వెంట అవకాశాలే క్యూ క‌డుతున్నాయి.

టాలీవుడ్ త‌ర‌హాలో బాలీవుడ్ లోనూ చ‌లాకీత‌నంతో దూసుకుపోతుంది. అలాగే న‌టిగా ఇమేజ్ చ‌ట్రంలో ఇరుకొక్కుండా మంచి క‌థ‌ల్లో...వినూత్న‌మైన పాత్ర‌ల్లోనూ మెప్పించే ప్ర‌య‌త్నం ప్ర‌శంస‌నీయం. ఇటీవ‌లే 'సీతారామం'లో ఆఫ్రిన్ అనే ముస్లీం యువ‌తి పాత్ర‌లో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వ‌డంతో రష్మిక క్రేజ్ రెట్టింపు అయింది.

మెయిన్ లీడ్ లో మృణాల్  ఠాకూర్ క‌నిపించినా..ర‌ష్మిక పాత్ర‌కి  మంచి  గుర్తింపు ద‌క్కింది. ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి రోల్ చేయ‌డం చాలా అరుదు. కానీ ర‌ష్మిక అలాంటి హ‌ద్దును చెరిపేసి సీతారామంలో న‌టించింది. ఆ ర‌కంగానూ ద‌ర్శ‌కుల హీరోయిన్ గా నిలిచింది.  ముస్లీమ్ యువ‌తి ఆహార్యంలో ఒదిగిపోయింది. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు మ‌రోసారి అదే సెంటిమెంట్ ని బాలీవుడ్ లో వ‌ర్కౌట్ చేయ‌బోతుందా? అంటే అవున‌నే అనిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఆమె హీరోయిన్ గా 'మిష‌న్ మ‌జ్ను' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సిద్దార్ద్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్నాడు. శంత‌న్ బ‌గ్సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పాకిస్తాన్ లో  భార‌త్ కోవ‌ర్ట్ మిష‌న్ నేప‌థ్యంలో సాగే వాస్త‌వ సం ఘ‌ట‌న‌లు ఆధారంగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దీనిలో భాగంగా చాలా స‌న్నివేశాలు నేరుగా శ‌త్రు దేశం పాకిస్తాన్ లో నే షూట్ చేసారు.

అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకొన్ని సాహ‌సోపేత‌మైన ప్రాంతాల్లోనూ షూట్ చేసారుట‌. పాకిస్తాన్ లో అవ‌స‌ర‌మైన స‌న్నివేశాల షూట్ కోసం ర‌ష్మిక ముస్లీమ్ యువ‌తిగాను ఆహార్యం మార్చుకుంద‌ని స‌మాచారం.

కొన్ని స‌న్నివేశాల్లో కేవ‌లం కంటిలో న‌ల్ల‌ని గుడ్డు మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని..ముఖంలో ఏ భాగం క‌నిపించ‌కుండా  పూర్తిస్థాయిలో  బూర్కా ధ‌రించి క‌నిపిస్తుందిట‌. మొత్తంగా  స్పై థ్రిల్ల‌ర్ లో ర‌ష్మిక ముస్లీమ్ యువ‌తి గెట‌ప్ లో ఆద్యంతం ఆక‌ట్టుకుటుంద‌ని స‌మాచారం.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News