రష్మిక కి ఆ బాధే లేనట్లుంది

Update: 2022-10-08 06:36 GMT
నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించిన మొదటి హిందీ సినిమా 'గుడ్‌ బై' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించినా కూడా ఈ సినిమాలో రష్మిక కు సాధ్యం అయినంత నటన ప్రదర్శించేందుకు స్కోప్‌ దక్కింది. మంచి పాత్ర ఆమెకు లభించింది... ఆ అవకాశం ను సద్వినియోగం చేసుకుంది.

గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న గుడ్‌ బై సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చినప్పటి నుండి కూడా రష్మిక ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ముఖ్యంగా చివరి పది రోజుల పాటు ముంబయి లో మకాం వేసి మరీ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అయ్యింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం చాలా కష్టపడ్డ రష్మిను చూస్తే సినిమా ఆమె కు మంచి పేరు తెచ్చి పెడుతుందని అంతా భావించారు.

సినిమా మరో రోజులో విడుదల కాబోతుంది అనగా అందరిని ఆశ్చర్యపర్చుతూ రష్మిక మందన్నా మాల్దీవ్స్ కి వెళ్లి పోయింది. స్నేహితుడు విజయ్ దేవరకొండ మరికొందరు స్నేహితులతో కలిసి రష్మిక మందన్నా హాలీడే ట్రిప్ కు వెళ్లడం అందరిని ఆశ్చర్యపర్చింది. ఇప్పటి వరకు ప్రమోషన్ చేసి చివరి రోజు ఉండకుండా వెళ్లిందేంటీ అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు.

గుడ్‌ బై సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పర్చింది. సినిమా ఫలితం ముందే ఊహించి రష్మిక వెళ్లిందా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం రష్మిక కు తన మొదటి హిందీ సినిమా ఫలితం ఇలా అయినందుకు బాధగా లేనట్లుంది.. అందుకే హాయిగా హాలీడేస్‌ ను ఎంజాయ్ చేస్తుందని ట్రోల్స్ చేస్తున్నారు.

ఒక సినిమాను కష్టపడి చేసిన తర్వాత ఆ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుంటారు. ఆ సినిమా ఫలితం ను బట్టే తదుపరి సినిమాల యొక్క పాత్రలు మరియు పారితోషికం ఉంటుంది.

కనుక ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాధ లేకుండా ఎలా ఉంటుంది.. పైగా ఆమెకు మొదటి హిందీ సినిమా కనుక ఆమెకు కచ్చితంగా బాధ ఉండే ఉంటుందని ఆమె అభిమానులు తెగ  బాధ పడుతున్నారు. ఈ సినిమా ఫలితంపై మన శ్రీవల్లి రెస్పాన్స్ ఏంటో చూడాలి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News