#PVT04 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

Update: 2023-01-02 04:51 GMT
మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 'ఉప్పెన‌'తో ఎంట్రీ ఇచ్చిన న‌టుడు అటుపై  'కొండ‌పొలం' లాంటి డిఫ‌రెంట్ అటెంప్ట్ తోనూ  విమర్శ‌కుల ప్ర‌శ‌సంలందుకున్నాడు. గతేడాది 'రంగ రంగ‌ వైభ‌వంగా'  సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఇది యావ‌రేజ్ గా ఆడింది. ఆ ర‌కంగా వైష్ణ‌వ్ ప్రేక్ష‌కుల్లో పాజిటివ్ వేవ్ లో ముందుకు సాగిపోతున్నాడు.  తాజాగా యంగ్ హీరో నాల్గ‌వ చిత్రం లాక్ అయింది. ఆసినిమాకి సంబంధించిన వివ‌రాలు తాజాగా రివీల్ చేసారు.

శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ- ఎస్. సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇది ప‌క్కా యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాతో  శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో  వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీలని హీరోయిన్ గా  ఎంపిక చేసారు.  సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ముందే రిలీజ్ తేదీని  ప్ర‌క‌టించారు.

షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసి  ఏప్రిల్ 29- 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్పుడు ట్రెండ్  ప్రారంభానికి ముందే హైప్ క్రియేటం అన్న‌ది ప‌రిపాటిగా మారిన సంగ‌తి తెలిసిందే. ఎలాంటి హ‌డావుడి లేకుండా సైలెంట్ గా ప్ర‌క‌టించి ట్విస్ట్ ఇస్తున్నారు. అటుపై  త‌దుప‌రి అప్ డేట్స్ వ‌చ్చే వ‌ర‌కూ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు. సాయి తేజ్ 'విరూపాక్ష'  సినిమా  విష‌యంలో ఇదే చోటు చేసుకుంది.

ఈ విష‌యంలో త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ అన్న‌య్య‌య‌ని అనుస‌రిస్తున్నట్లు క‌నిపిస్తుంది. ఇది యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్  అని రివీల్ చేసిన నేప‌థ్యంలో?  వైష్ణ‌వ్ కంటెంట్  చూజింగ్ ప‌రంగా డిఫ‌రెంట్  స్ర్టాట‌జీతో ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఇన్నోవేటివ్ సినిమాలు చేస్తూనే క‌మ్శియ‌ల్ చిత్రాల‌కు పెద్ద పీట వేస్తున్నాడు. కొత్త త‌రం ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించ‌డంలో ముందుంటున్నాడు. అలాగే ఈ సినిమాలో శ్రీలీల ఎంపిక కూడా మంచి హైప్ తీసుకొచ్చేదే. ప్ర‌స్తుతం అమ్మ‌డికి యువ‌త‌లో మంచి క్రేజ్ ఉంది.

ఈ చిత్రానికి డడ్లీ ఛాయాగ్రహణం స‌మ‌కూర్చుతున్నారు.  నవీన్ నూలి ఎడిటర్.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ .. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News