చియాన్ విక్రమ్ గత కొంత కాలంగా తన ఫామ్ ని కోల్పోయాడు. ' మల్లన్న' తరువాత కనీసం ఆ స్థాయి సక్సెస్ ని కూడా సొంతం చేసుకోలేక రేస్ లో వెనక బడ్డాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. అరుళ్ నిధితో 'డీమోంటీ కాలనీ', నయనతార, అధర్వతో 'ఇమైక్కా నోడిగల్'యాక్షన్ థ్రిల్లర్ లని అందించిన అజయ్ జ్ఞానముత్తు మూడవ ప్రయత్నంగా చేసిన మూవీ 'కోబ్రా'.
'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ స్టార్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటించిన ఈ మూవీని ముందు ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ డేట్ ని మార్చేసి కొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారట.
మంగల వారం ఈ మూవీని ఆగస్టు 31న రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ వార్త విని విక్రమ్ ఫ్యాన్స్ కొంత వరకు హ్యాపీ ఫీలయ్యారు.
తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో మాత్రమే విడుదల కానున్న ఈ మూవీలో మియాజార్జ్, పద్మప్రియ, మృనాళిని రవి, ఆనంద్ రాజ్, కె.ఎస్. రవికుమార్, రోబో శంకర్, బాబు ఆంటోనీ తదితరులు నటించారు.
రష్యా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీలో హీరో విక్రమ్ దాదాపు 20 విభిప్నమైన గెటప్ లలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంటున్న నేపథ్యంలో విక్రమ్ ని ఎవరు పట్టించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కంటెంట్ వున్న సినిమాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రేక్షకుల మైండ్ సెట్ మారిన నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న విక్రమ్ మూవీని ప్రేక్షకులు పట్టించుకుంటారా? లేదా అన్నది తెలియాలంటే ఆగస్టు 31 వరకు వేచి చూడాల్సిందే.