కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కేజీఎఫ్' సీరిస్ సినిమాలతో బ్యాక్ టు పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ లని సొంతం చేసుకుని క్రేజీ స్టార్ గా మారిపోయారు. కేవలం రెండే రెండు సినిమాలతో దేశ వ్యాప్తంగా తన పేరు రీసౌండ్ ఇచ్చేలా చేశారు. ప్రభాస్ తరువాత దక్షిణాది నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. 'కేజీఎఫ్ 2' తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టాడు. దీంతో ప్రభాస్ సినిమా కోసం యావత్ దేశం మొత్తం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అదే తరహా ఆసక్తి యష్ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
కేజీఎఫ్ 2తో రికార్డులు సృష్టించిన యష్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ఆయనని టాలీవుడ్ లో స్టార్ ప్రొడక్షన్ కంపనీలుగా పేరున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, మైత్రీ మూవీమేకర్స్ వారు సంప్రదించారట. కానీ యష్ మాత్రం ఆచితూచి అడుగువేయాలని తొందరపడకూడదని భావించి ఈ భారీ ప్రొడక్షన్ కంపనీకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ప్రభాస్ 'బాహుబలి' తరువాత ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లని పట్టాలెక్కిస్తే యష్ మాత్రం స్లో అండ్ స్టడీ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ 2' విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా యష్ తన తదుపరి ప్రాజెక్ట్ గా 19వ సినిమాని ఎవరితో చేయబోతున్నాడు? ఏ ప్రొడక్షన్ హౌస్ కి చేయబోతున్నాడు? అన్నది ఇప్పడు దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. 'కేజీఎఫ్' సిరీస్ చిత్రాలతో యష్ కు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టే అభిమాన గనం కూడా భారీ స్థాయిలో ఏర్పడింది. దీంతో యష్ తదుపరి ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో యష్ రెండు ప్రాజెక్ట్ లని కన్నడ డైరెక్టర్లతో చేయబోతున్నాడని, వీటితో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని కూడా చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై యష్ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఇదిలా వుంటే యష్ తన 19వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేయబోతున్నాడంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బడ్జెట్ కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో వుంటుందని, ఇండియాలోనే కాకుండా స్పానిష్ లోనూ ఈ మూవీ ని రిలీజ్ చేస్తారంటూ నెట్టింట ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది.
#Yash19 లెజెండరీ డైరెక్టర్ శంకర్ సర్ తో వుండబోతోందని, ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రూపొందుతున్న సూపర్ హీరో మూవీ అని, కన్నడతో తెరకెక్కనున్న ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు స్పానిష్ లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం భారతీయ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో 800 కోట్ల బడ్జెట్‌ని కేటాయించబోతున్నారని, ఈ మూవీతో యష్ చరిత్ర సృష్టించడం ఖాయం అని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే యష్ నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.