సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉండే సామ్.. సడన్ గా విరామం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈరోజు ''యశోద'' టీజర్ అప్డేట్ తో సైలెన్స్ ను బ్రేక్ చేసింది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''యశోద". సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ను.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ఆసక్తిని కలిగించాయి.
నేడు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని 'యశోద' సినిమా నుంచి సమంత సరికొత్త అప్డేట్ తో వచ్చింది. సెప్టెంబర్ 9న సాయంత్రం 5.59 గంటలకు గ్రిప్పింగ్ టీజర్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని షేర్ చేసింది.
ఇందులో కొంతమంది అమ్మాయిల మధ్యలో సమంత ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ఆమె ముఖం మీద గాయాలను కూడా మనం గమనించవచ్చు. 'యశోద' సినిమాలో సామ్ పాత్ర ఏంటనేది టీజర్ లో తెలిసే అవకాశం ఉంది.
''యశోద'' చిత్రాన్ని దర్శకద్వయం హరి & హరీష్ తెరకెక్కించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ - రావు రమేష్ - ఉన్ని ముకుందన్ - కల్పిక గణేష్ - సంపత్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అశోక్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.
వాస్తవానికి 'యశోద' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో వాయిదా వేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
సమంత తెలుగులో 'జాను' సినిమా తర్వాత 'పుష్ప' లో ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఇదే క్రమంలో 'కణ్మణి రాంబో ఖతీజా' అనే డబ్బింగ్ మూవీతో పలకరించిన సామ్.. 'యశోద' 'శాకుంతలం' 'ఖుషి' వంటి పాన్ ఇండియా సినిమాతో రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.