టాలీవుడ్ హిస్టరీని తిరగేస్తే బ్రేక్ డ్యాన్సులు షేక్ డ్యాన్సులు చేయడంలో అందాల కథానాయిక రాధ గురించి ముచ్చటించుకునేవారు. 90లలో మెగాస్టార్ చిరంజీవితో పోటీపడుతూ ఫ్రీ అండ్ ఫ్లోలో డ్యాన్సులు ఇరగదీయడంలో రాధ తర్వాతేనన్న చర్చ సాగింది. అందుకే చిరు-రాధ కాంబినేషన్ కి యూత్ లో బంపర్ క్రేజ్ ఉండేది. ఆ ఇద్దరూ బ్రేక్ డ్యాన్సులకు ఆద్యులు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో విలేజీల్లో స్టేజీ డ్రామాల్లో ఆర్టిస్టులు చిరు- రాధ కాంబో బ్రేక్ డ్యాన్సుల పాటలను ప్రదర్శించేందుకు ఎంతో ఆసక్తిని కనబరిచేవారంటే ఆ క్రేజును అర్థం చేసుకోవచ్చు.
రాధ తర్వాత ఇంకెవరున్నారు? అంటే చాలా మంది కథానాయికలు ఉన్నా కానీ వారంతా ఫ్రీ అండ్ ఫ్లోలో మాస్ స్టెప్పులతో అసాధారణమైన మ్యాజిక్ చేసిన వాళ్లు లేరు. నగుమోము నగ్మ అరేబియన్ గుర్రంలా రెచ్చిపోయి డ్యాన్సులు చేసేది. మళ్లీ అంత ఫ్లోతో రమ్యకృష్ణ- రంభ డ్యాన్సులు అదరగొట్టారు. విజయశాంతి లాంటి స్టార్లు చిరంజీవితో పోటీపడేందుకు ప్రయత్నించేవారు.
నేటితరంలో డ్యాన్సింగ్ క్వీన్ ఎవరు? అంటే సమంత గురించో లేకపోతే పూజా హెగ్డే లేదా కీర్తి సురేష్ గురించో ఎవరూ చెప్పరు. యువతరం ఏమాత్రం తడుముకోకుండా ఫిదా బ్యూటీ సాయిపల్లవి పేరునే ప్రస్థావిస్తారు. సాయిపల్లవితో సమానంగా పరిశ్రమలో ప్రవేశించిన ఎందరో కథానాయికలకు డ్యాన్సుల పరంగా అంతటి గుర్తింపు లేదు. కానీ సాయిపల్లవి డ్యాన్సింగ్ క్వీన్ గా ఒక సంచలనం. ఫిదా మొదలు ఏ సినిమా చూసినా అందులో సాయిపల్లవి డ్యాన్సులే హైలైట్. నిజం చెప్పాలంటే సాయిపల్లవి డ్యాన్సులు వీక్షించేందుకు థియేటర్లకు వచ్చే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఫిదాలో వచ్చిండే పిల్లా.. ధనుష్ తో `రౌడీ బేబి..` పాటలు ఎంత పెద్ద సంచలనమో తెలిసిందే. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ లైక్ లు క్లిక్ లతో ఈ పాటలు హోరెత్తించాయంటే దానికి కారణం సాయిపల్లవి డ్యాన్సింగ్ ట్యాలెంట్.
ఒకదానిని మించి ఇంకొకటి....!
ఫిదా చిత్రంలోని `వచ్చిండే పిల్ల..` సాంగ్ సాయిపల్లవిని మరో లెవల్లో నిలబెట్టింది. రౌడీ పిల్ల సాయి పల్లవి మాయ అంతగా పని చేసింది. యూట్యూబ్ లో రికార్డులు బద్ధలు కొట్టిన ఈపాటకు వేరొకటి సాటి లేదు. ఆ తర్వాత కూడా ధనుష్ సరసన `రౌడీ బేబి..` సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్సింగ్ విన్యాసాలకు యూట్యూబ్ షేక్ అయ్యింది. ఆ రెండు పాటల తర్వాత మళ్లీ అలాంటి మరిన్ని చార్ట్ బస్టర్ లను అభిమానులు కోరుకున్నారు. ఆ లోటు తీరుస్తూ తాజా చిత్రం `లవ్ స్టోరీ`లో సాయి పల్లవి `సారంగ దరియా..` పాటతో అంతే ఇదిగా ఆకట్టుకుంది. మునుముందు ఈ భామ నుంచి ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్సెస్ ని ఆశించగలం.
అయితే ఇన్నాళ్టికి సాయిపల్లవితో పోటీపడే అద్భుతమైన డ్యాన్సింగ్ స్టార్ టాలీవుడ్ కి లభించిందన్న టాక్ ఇప్పుడు వేడి పుట్టిస్తోంది. ఇంతకీ ఎవరీ అమ్మడు? అంటే.. `ధమాకా` బ్యూటీ శ్రీలీల పేరును సూచిస్తున్నారు. నటించిన తొలి సినిమా పెళ్లి సంద-డి తోనే ఈ అమ్మడు తానేంటో చూపించింది. రాఘవేంద్రరావు సినిమాలో డ్యాన్సుల్లో ఎనర్జీతో మతులు చెడగొట్టిందన్న చర్చ సాగింది. శ్రీలీల నటన వైబ్రెన్సీ కుర్రకారు గుండెల్ని జిల్లనిపించేస్తోంది. ఇప్పుడు ధమాకా ఓపెనింగులకు మాస్ రాజా రవితేజ కంటే శ్రీలీల ప్రధాన కారణం అంటూ అభిమానులు గుసగుసలాడేస్తున్నారు.
ధమాకా రొటీన్ కంటెంట్ సినిమా అయినా కానీ శ్రీలీల డ్యాన్సుల కోసం జనం థియేటర్లకు వస్తున్నారంటూ సోషల్ మీడియాల్లో గగ్గోలు మొదలైంది. ఇన్నాళ్లూ సాయి పల్లవిలా డాన్స్ చేయగల మరో కథానాయిక టాలీవుడ్ లో లేరు.. ఇప్పటికి దొరికింది.. డ్యాన్సుల్లో `రాధ- సాయిపల్లవి`ని కొట్టేట్టుందే! అన్న టాక్ వినిపిస్తోంది. ఇక సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయదు.. కానీ శ్రీలీల మాత్రం గ్లామర్ తోను దుమ్ము రేపేస్తోంది. అందాలు ఆరబోసేందుకు ఈ అమ్మడికి ఎలాంటి భేషజాలు లేవు. దీంతో డ్యాన్సింగ్ ట్యాలెంట్ లో రాధ- సాయిపల్లవి వారసురాలిగా వెలిగిపోతోంది.
`ధమాకా`లో `నిన్ను చూస్తే ఎట్నో ఉంటది...`... `పల్సర్ బైక్...` పాటల్లో శ్రీలీల డ్యాన్సులతో కుమ్మేసింది అంటూ క్రిటిక్స్ సహా కామన్ ఆడియెన్ కితాబిచ్చేశారు. ఈ బ్యూటీ ఒక కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసి ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికిప్పుడు నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ సూట్ కేసులతో రెడీగా ఉన్నారంటూ కథనాలొస్తున్నాయి. అంటే నెక్ట్స్ జెన్ స్టార్ గా శ్రీలీల వెలిగిపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. నటించిన తొలి రెండు సినిమాలతోనే వేవ్స్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇంకెన్ని విన్యాసాలు చేస్తుందో చూడాలన్న ఆసక్తి అందరిలో ఉంది.