ఉప్పెన గ్రాండ్ స‌క్సెస్.. స్పెష‌ల్ పార్టీలో చిల్ చేసే స్టార్ హీరో ఎవ‌రు?

Update: 2021-03-16 17:30 GMT
కోవిడ్ మ‌హ‌మ్మారీ భ‌యాల్ని ప‌టాపంచ‌లు చేయ‌డంలో టాలీవుడ్ ముందు వ‌రుస‌లో ఉంది. జ‌న‌వ‌రి మొదలు వ‌రుసగా థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజై సంద‌డి చేసాయి. జ‌నాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో చాలా సినిమాలు స‌ఫ‌ల‌మ‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక  మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ తొలి ప‌రిచ‌య చిత్రం `ఉప్పెన‌` స్టార్ హీరో మూవీ రేంజులో రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌ను సాధించింది.

డెబ్యూ హీరో డెబ్యూ నాయిక అయినా టాలీవుడ్ లో చాలా రికార్డుల్ని బ్రేక్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైనా కానీ ఇంత‌టి విజ‌యానికి మైత్రి సంస్థ ఆనంద‌డోలిక‌ల్లో తేలుతోంది. ఉప్పెన‌ బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల షేర్ మార్కును దాటింది. 100కోట్ల గ్రాస్ వ‌సూలైంది అంటూ పోస్ట‌ర్ల‌ను వేసారు మైత్రి అధినేత‌లు.

అయితే ఆ రేంజు బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన సినిమాకి స్పెష‌ల్ ట్రీట్ ఉండ‌దా? అంటే.. తాజా స‌మాచారం మేర‌కు.. మేకర్స్ ఈ నెల 18 న హైదరాబాద్ లో ఓ రేంజులో స్పెష‌ల్ స‌క్సెస్ వేడుక‌ను అనంత‌రం ఇండ‌స్ట్రీ సెల‌బ్స్ కి ప్ర‌త్యేక‌ పార్టీని ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఆ రోజు ఉప్పెన టీమ్ తో ఒక ప్రముఖ అతిథి చిల్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఓ ప్ర‌ముఖ స్టార్ హీరోని ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు మైత్రి బృందాలు ప్లాన్ చేశాయ‌ట‌.

తాజాగా స‌ముద్ర‌మంత ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ పోస్ట‌ర్ వేసింది టీమ్. `ఉప్పెన‌`కు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.  వైష్ణవ్ తేజ్ స‌ర‌స‌న కృతి శెట్టి నాయిక‌. మైత్రి మూవీ మేకర్స్- సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Tags:    

Similar News