మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన 'ఉప్పెన' సినిమా. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఫిబ్రవరిలో వాలెంటైన్స్ వీక్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడిచింది. కరోనా పాండమిక్ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించబడటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇక 'ఉప్పెన' సినిమా ఓ క్లాసిక్ అని.. ఇప్పటి వరకు ఇలాంటిది రాలేదని బాగానే ప్రచారం చేశారు. అలానే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టిందని.. 100 కోట్ల క్లబ్ లో చేరిందని అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఇటీవల బుల్లితెరపైకి వచ్చింది 'ఉప్పెన'.
ప్రముఖ తెలుగు ఎంటర్టైమెంట్ ఛానల్ 'స్టార్ మా' లో ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 'ఉప్పెన' సినిమా టెలికాస్ట్ అయింది. ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతుందని హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటుందని అనుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని జనాలు టీవీలో పెద్దగా ఆదరించలేదని కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా బుల్లితెర మీద కూడా అదే రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయాలి. టీఆర్పీ ఎంత వచ్చిందనేది తెలియనప్పటికీ.. 'ఉప్పెన' విషయంలో మాత్రం అది జరగలేదని టాక్ నడుస్తోంది. సక్సెస్ మీట్ అని, సక్సెస్ సెలబ్రేషన్స్ అని ఈ సినిమాకు సంబంధించి అనేక ఈవెంట్స్ చేసిన ప్రొడ్యూసర్స్, అందుకే 'ఉప్పెన' టీవీ రికార్డుల గురించి ప్రస్తావించలేదని.. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ వచ్చి ఉంటే ఈపాటికే హడావుడి ఉండేదని ఫిల్మ్ సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.