పోలీస్ కేసులో బోల్డ్ బ్యూటీ ఉక్కిరిబిక్కిరి

Update: 2022-10-26 04:04 GMT
స‌న్నీలియోన్ - దిశా ప‌టానీ త‌ర్వాత హిందీ చిత్ర‌సీమ‌లో సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతోంది ఉర్ఫీ జావేద్. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ ప్ర‌తిసారీ ఏదో ఒక వివాదంతో హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. దీపం ఉండ‌గానే కెరీర్ ని చ‌క్క‌దిద్దుకునే ప్ర‌య‌త్నంలో ఇలాంటివ‌న్నీ కామ‌నే అనుకున్నా కానీ ఈ భామ‌పై ఇప్పుడు పోలీస్ కేసులు ఫైల్ అవుతుండ‌డం టెన్ష‌న్ పెడుతోంది.

ర‌క‌ర‌కాల కార‌ణాలతో ఎప్పుడూ హెడ్ లైన్స్ లో కి రావ‌డం ద్వారా సోష‌ల్ మీడియాల్లో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించిన ఈ బ్యూటీ ఉన్న‌ట్టుండి జైల్లో ఊచ‌లు లెక్కించే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిందేమోనంటూ నెటిజ‌నులు అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. ఉర్ఫీ క్షేమంగా ఉండాల‌ని నెటిజ‌నులు భ‌గవంతుని వేడుకుంటున్నారు.

పాపుల‌ర్ టీవీ స్టార్ ఉర్ఫీ త్వ‌ర‌గా సినీస్టార్ గా ఎద‌గాల‌నుకుంటోంది. అందులో భాగంగా వేగంగా పాపులారిటీని పెంచుకుంటోంది. ఉర్ఫీ ఇటీవల రిలీజ్ చేసిన‌ మ్యూజిక్ వీడియో ``హే హే యే మజ్బూరి`` వ‌ల్ల ఇప్పుడు అనూహ్యంగా ఇబ్బందుల్లో పడింది. ఎలక్ట్రానిక్ రూపంలో లేదా మార్గంలో లైంగిక అసభ్యత‌ను కలిగి ఉన్న మెటీరియల్ ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం చ‌ట్ట ప్ర‌కారం నిషేధం. ఇదే కోణంలో ఢిల్లీలో ఉర్ఫీపై అనామక ఫిర్యాదు దాఖలైంది. ఫిర్యాదుదారు ఆమె మ్యూజిక్ వీడియో ``హే హే యే మజ్బూరి``ని ప్రస్తావించారు.

అక్టోబర్ 11న యూట్యూబ్ లో విడుదలైన ఈ పాటలో ఉర్ఫీ ఎరుపు రంగు చీరలో హాట్ హాట్ గా కనిపించింది. ఇది బయటకు వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట 8 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ని సాధించింది. అందులో ఉర్ఫీ అందాల ఆర‌బోత‌ను సెన్సాఫ్ అవతార్ కి యువత‌రం మైమ‌రిచిపోతున్నారు. అభిమానులు ఉర్ఫీ తనను తాను ప్ర‌మోట్ చేసుకునే విధానాన్ని ఇష్టపడతారు. స్వ‌యంగా వినూత్న ఫ్యాషన్ శైలిని సృష్టించిన ఘ‌న‌త ఉర్ఫీకే చెందుతుంది. అయితే ఆమె బోల్డ్ దుస్తులను ఎంపిక చేసినందుకు చాలాసార్లు ట్రోలింగుకి గురైంది.

ప్ర‌తిసారీ ట్రోలింగ్ జ‌రిగే కొద్దీ త‌న సోష‌ల్ మీడియాల్లో ఫాలోవ‌ర్స్ పెరుగుతున్నారు. అక్టోబర్ 23న తనపై దాఖలైన ఫిర్యాదుపై ఉర్ఫీ ఇంకా స్పందించలేదు. అంతకుముందు ఉర్ఫీ పాట షూటింగ్ నుండి షాక్ నిచ్చే ఓ వీడియోని షేర్ చేసారు. ఈ వీడియోలో ఉర్ఫీ ఆఫ్-షోల్డర్ బ్లౌజ్ ధరించి టాన్జేరిన్ చీరలో డ్యాన్సులు చేస్తూ క‌నిపించింది. చుట్టూ డ్యాన్సర్ లతో పాటకు గ్రూవ్ చేస్తున్నప్పుడు ఉర్ఫీ తను నిలబడి ఉన్న ఊయల నుండి జారి పడిపోయింది. అయితే ఆక‌స్మిక ఘ‌ట‌న‌లో డ్యాన్సర్లు అలెర్ట‌య్యి ఆమెకు గాయం కాకుండా కాపాడారు.

ఉర్ఫీ పోస్ట్ పై వ్యాఖ్యానిస్తూ నెటిజ‌నులు దేవునికి ధన్యవాదాలు తెలిపారు. మీరు సురక్షితంగా ఉన్నారు. మీరు మ‌మ్మ‌ల్ని భయపెట్టారు!! అంటూ ఫ్యాన్స్ నుంచి ఆవేద‌న వ్య‌క్త‌మైంది. బోల్డ్ బ్యూటీపై బోలెడంత ప్రేమ కురిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News