వీడియో టాక్: ఉర్ఫీ ఉరుములు మెరుపులు స‌రే కానీ!

Update: 2022-10-12 15:13 GMT
సోష‌ల్ మీడియాలు డిజిట‌ల్ యుగంలో ప్ర‌తిభావంతులు త‌మ‌ను తాము నిరూపించుకునేందుకు ఎక్కువ‌గా శ్ర‌మించ‌న‌వ‌స‌రం లేదు. ఈ వేదిక‌ల‌పై ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లు స్టార్లు అవుతున్నారు. ఇక టీవీ న‌టి కం మోడ‌ల్ ఉర్ఫీ జావేద్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ఎంతగా పాపుల‌రైందో తెలిసిందే. త‌న‌కు టీవీ న‌టిగా అంత గుర్తింపు లేదు.

బిగ్ బాస్ తో కొంత పాపుల‌రైంది. కానీ వీట‌న్నిటినీ మించి త‌న‌దైన విచిత్ర వేష‌ధార‌ణ‌ల‌తో ఈ భామ హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. కేవ‌లం తన విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ అభిమానులు ఫాలోవ‌ర్స్ ని పెంచింది.

నిరంత‌రం ఇన్ స్టా స‌హా సోష‌ల్ మీడియాల్లో త‌న అభిమానుల‌ను అల‌రించేందుకు వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ త‌నదైన‌ ప్ర‌య‌త్నంలో ఉర్ఫీ ఎప్పుడూ విఫ‌లం కాలేదు. ప్ర‌తిసారీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో హాట్ టాపిక్ గా మారుతోంది. బోల్డ్ అవతారంలో ప్ర‌తిసారీ ఏదో ఒక ప్ర‌యోగం చేస్తూ నేటిత‌రం న‌టీమ‌ణుల్లో కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఉర్ఫీ మ‌రీ టూమ‌చ్ గా ఎక్స్ పోజ్ చేస్తోంద‌ని పొట్టి బ‌ట్ట‌లు ధ‌రిస్తోంద‌ని కామెంట్లు వినిపించినా కానీ.. అదే ఆమెను ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ గా మార్చింది.

ఉర్ఫీ జావేద్ మొట్టమొదటి వీడియో సాంగ్ `హయీ హయీ యే మజ్ బురి` విడుదలైంది. ఈ రీమిక్స్ పాటలో వ‌య్యారి భామ‌ కాస్ట్యూమ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నృత్యంతో లేదా హావ‌భావాల‌తో కంటే కాస్ట్యూమ్స్ తో నే ఈ భామ ఎక్కువ మెరిపించింద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉర్ఫీ కొన్ని అల్ట్రా గ్లామ‌ర‌స్ డిజైన‌ర్ దుస్తులలో తన వంపుసొంపుల‌ను ఆవిష్క‌రించేందుకు పోటీప‌డింది. ఉర్ఫీ గ్లామర్ తో ఈ పాటకు ప్రేక్షకులలో కొంత క్రేజ్ ను పెంచింది.

వెట‌ర‌న్ గాయ‌ని లతా మంగేష్కర్ పాడిన పాత పాటను ఇప్పుడు రీమిక్స్ చేసారు. ఈ రీమిక్స్ వెర్షన్ కోసం శృతి రాణే కొత్త గాత్రాన్ని పాడింది. విజువల్స్ కు ఉర్ఫీ గ్లామర్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఉర్ఫీ ఇలాంటి ప్ర‌య‌త్నాలెన్నో చేస్తూ సోష‌ల్ మీడియాల్లో త‌న క్రేజ్ ను అంత‌కంత‌కు పెంచుకుంటోంది. అయితే అందుకు త‌గ్గ‌ట్టు పెద్ద తెర‌పై భారీ క్రేజీ ఆఫ‌ర్లు త‌న‌ని వ‌రించినట్టు ఆధారాల్లేవ్. క‌నీసం ఐట‌మ్ నంబ‌ర్ల కోసం అయినా టాలీవుడ్ పిలుస్తుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News